IPL 2025: ధనాధన్ లీగ్‌కు గ్లామర్ టచ్.. ఐపీఎల్-2025 ఓపెనింగ్ సెర్మనీలో సందడి చేసే సినీ తారలు వీరే!
ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవం మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఘనంగా జరగనుంది. తొలి మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. అంతకు ముందు జరిగే ఓపెనింగ్ సెర్మనీలో పలువురు సినీ తారలు సందడి చేయనున్నారు.

ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవం మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. ఎప్పటిలాగే ఈ సంవత్సరం ఐపీఎల్‌ను భారీ స్థాయిలో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలో అనేక మంది సినీ తారలు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో షారుఖ్ ఖాన్ , ప్రియాంక చోప్రా, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, శ్రద్ధా కపూర్, సంజయ్ దత్ తదితరులు ఈ వేడుకలో పాల్గొనే అవకాశం ఉంది. అలాగే అమెరికన్ పాప్ బ్యాండ్ వన్ రిపబ్లిక్ ఈ సందర్భంగా ఒక అద్భుతమైన ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, ఆర్‌సీబీ తలపడనున్నాయి. కోల్‌కతా జట్టు యజమాని షారుఖ్ ఖాన్ ఇందులో పాల్గొనడం ఖాయం. ఈ కార్యక్రమంలోనే సల్మాన్ ఖాన్ తన రాబోయే చిత్రం ‘సికందర్’ ను ప్రమోట్ చేసే అవకాశం ఉంది.
అర్జిత్ సింగ్, శ్రేయా ఘోషల్, కరణ్ ఆజ్లా, దిశా పటాని, శ్రద్ధా కపూర్, వరుణ్ ధావన్ కూడా ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉంది. ‘టెల్ మీ’ పాట కోసం కరణ్ ఔజ్లా, దిశా పటాని వన్ రిపబ్లిక్ బ్యాండ్‌తో కలిసి పనిచేశారు. కాబట్టి వీరి స్పెషల్ పెర్ఫామెన్స్ కూడా ఉండనుందని తెలుస్తోంది. అలాగే కత్రినా కైఫ్, అనన్య పాండే, మాధురీ దీక్షిత్, జాన్వీ కపూర్, కరీనా కపూర్, పూజా హెగ్డే, ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ సహా పలువురు బాలీవుడ్ తారలు ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీకి హాజరుకానున్నారని తెలుస్తోంది.
మొదటి మ్యాచ్ కోసం రెడీ అవుతోన్న ఆర్సీబీ..
Royal Challenge Packaged Drinking Water Moment of the Day 📸
The age-old gully game debate: Who should take strike? 😅😉#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 pic.twitter.com/n7enKdJbAC
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 19, 2025
కాగా ఈ సంవత్సరం ఐపీఎల్‌లో 23 వేదికల్లో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగుతాయి, ఫైనల్ మే 25న జరుగుతుంది. కోల్ కతా నైట్ రైడర్స్ డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగనుంది. అలాగే ఆర్‌సిబి, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి.
ఆర్సీబీ తో పోరుకు రెడీ అంటోన్న కోల్ కతా నైట్ రైడర్స్..
Squad goals? More like swag goals! 😎💜 Get your jersey today. pic.twitter.com/ilIqg2dS7c
— KolkataKnightRiders (@KKRiders) March 19, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




