- Telugu News Photo Gallery Cinema photos Sai Pallavi and her sister Pooja Kannan rocks in wedding, Photos here
Sai Pallavi: పెళ్లి వేడుకలో సాయి పల్లవి సిస్టర్స్ హంగామా.. ఇద్దరూ అస్సలు తగ్గట్లేదుగా.. ఫొటోస్ ఇదిగో
అమరన్, తండేల్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకుంది న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి. ప్రస్తుతం బాలీవుడ్ రామాయణం సినిమా షూటింగ్ లో బిజి బిజీగా ఉంటోందీ అందాల తార. ఇదిలా ఉంటే తాజాగా తన బంధువు పెళ్లి వేడుకలో సాయి పల్లవి తళుక్కుమంది.
Updated on: Mar 18, 2025 | 10:46 PM

సాయి పల్లవి ఎక్కడ ఉంటే అక్కడ సందడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన బంధువు పెళ్లి వేడుకకు హాజరైంది.

సాయి పల్లవితో పాటు ఆమె సోదరి పూజా కన్నన్ కూడా ఈ పెళ్లి వేడుకలో తళుక్కుమంది. అలాగే కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.

ఇక నీలి రంగు చీరలో సాయిపల్లవి ఈ వివాహ వేడుకకే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఇక చెల్లి పూజా కన్నాన్ కూడా అక్కని మించిపోయే అందంతో కనిపించింది.

ప్రస్తుతం ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో సాయి పల్లవి సీతగా నటిస్తుంది.

రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాలో యష్ రావణుడిగా కనిపించనున్నాడు. బాలీవుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది.





























