OTT Movie: ధనుష్ డైరెక్షన్‌లో అనిఖా సురేంద్రన్ లవ్ స్టోరీ.. అప్పుడే ఓటీటీలోకి లేటెస్ట్ హిట్ సినిమా
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన మూడో సినిమా ‘నిలవుకు ఎన్ మెల్ ఎన్నాడి కోబం’. తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా? పేరుతో రిలీజైంది. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ఆడియెన్స్ ను ముఖ్యంగా యూత్ ను బాగా ఆకట్టుకుంది.

పవిష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ధనుష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా యూత్ ను బాగా అలరించింది. . ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌లో రిలీజ్ చేశారు పవిష్ నారాయణ్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకున్నా హీరోయిన్స్ అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్‌లు సుపరిచితులే. అందుకే ఈ మూవీకి తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. థియేటర్లలో ఆడియెన్స్ ను అలరించిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈనెల 21 నుంచి ఈ సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ రొమాంటిక లవ్ స్టోరీ ఒకేసారి స్ట్రీమింగ్ కానుంది.
వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్‌లో స్తూరి రాజా, విజయలక్ష్మి కస్తూరి రాజా ‘జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాను నిర్మించారు. వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనర్హన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. మరి థియేటర్లలో ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను మిస్ అయ్యారా? అయితే మరో మూడు రోజులు ఆగండి. ఎంచెక్కా ఇంట్లోనే ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..
As we’ve SAID 💪😎🔥 #NEEK aka #NilavukuEnmelEnnadiKobam will be Streaming From MARCH 21st On Prime Video💍🌙✨#Pavish | #AnikhaSurendran | #PriyaPrakashWarrier | #MathewThomas | #GVPrakash | #Dhanush 😎👍⭐#NEEKOnPrime#NilavukuEnmelEnnadiKobamOnPrime https://t.co/rwCphR2kSo pic.twitter.com/siG39TtnmN
— OTT STREAM UPDATES (@newottupdates) March 18, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి