Samantha: చచ్చినా చూడాల్సిందే.. సమంత కొత్త సినిమా రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్!
విడాకుల తర్వాత పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ పరంగానూ తీవ్ర ఒడిదొడకులు ఎదుర్కొంది స్టార్ హీరోయిన్ సమంత. మయోసైటిస్ వంటి ఆరోగ్య సమస్యలు సామ్ ను చుట్టు ముట్టాయి. దీనికి విదేశాల్లో చికిత్స కూడా తీసుకుంది. ఈ కారణంగా సామ్ సినిమాలపై పెద్దగా శ్రద్ధ పెట్టలేకపోయింది.

తన జీవితంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు రెడీ అవుతోంది సమంత. ఓవైపు వరుసగా వెబ్ సిరీస్‌లలో నటిస్తోన్న ఆమె మరోవైపు కొన్ని సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. కాగా న్యూ ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేసేందుకు సమంత ‘త్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రొడక్షన్ బ్యానర్ లో రూపొందిన ఒక సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోన్న ఈ సినిమా వేసవి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది.సమంత ‘త్రాలా మూవింగ్ పిక్చర్స్’ అనే బ్యానర్ పై ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సమంత కూడా నటించనుందని చెబుతున్నారు. ఈ చిత్రం దర్శకుడు, ఇతర తారాగణం గురించి ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
దీని సంగతి పక్కన పెడితే. ఇప్పుడు సామ్ నిర్మాణ సంస్థలో నిర్మించిన మరో చిత్రం విడుదల కానుంది. అదే శుభం.. చచ్చినా చూడాల్సిందే అన్నది ఈ మూవీ క్యాప్షన్. వసంత్ మరిగంటి రాసిన ఈ కథను డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కిస్తున్నారు. అంతకు ముందు వారిద్దరి కాంబోలో ‘సినిమా బండి’ అనే సూపర్ హిట్ సినిమా వచ్చింది. ఇప్పుడు కొత్త బృందంతో తెరకెక్కించిన ‘శుభం’ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఈ సినిమా మే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. త్వరోలనే ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ కానుంది. అప్పుడే రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. శుభం సినిమాలో సి.మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్,శ్రావణి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
శుభం సినిమా యూనిట్ తో సమంత..
View this post on Instagram
ఇక సమంత విషయానికి వస్తే.. ప్రస్తుతం వరుసగా వెబ్ సిరీస్‌లు చేస్తోంీ అందాల తార. గతంలో ఆమె నటించిన ‘ఫ్యామిలీమ్యాన్ 2’ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ‘సిటాడెల్: హనీ బని’ సిరీస్ కు కూడా ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తోంది సామ్.
సమంత లేటెస్ట్ గ్లామరస్ ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




