Janhvi Kapoor: నువ్వు దళితుడివి కదా? జాన్వీ కపూర్ బాయ్ ఫ్రెండ్‌ను దూషించిన నెటిజన్.. రిప్లై ఏమిచ్చాడంటే?
బాలీవుడ్ అందాల తార, దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ డేటింగ్ లో వుందని బాలీవుడ్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ మెల్లిగా టాలీవుడ్ లోనూ బిజీ అవుతోంది. ఇప్పటికే దేవర సినిమాతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు రామ్ చరణ్ ఆర్ సీ 16(వర్కింగ్ టైటిల్) సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. జాన్వీ కపూర్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహరియా తో ప్రేమలో ఉందని తెలుస్తోంది. వారిద్దరూ తమ ప్రేమను బయటకు చెప్పకపోయినా, వివిధ పార్టీలు, కార్యక్రమాలు, సినిమా ప్రదర్శనలలో కలిసే కనిపిస్తున్నారు. అంతే కాదు ఇటీవల జాన్వీ శిఖర్ తల్లి కలిసి సిద్ధివినాయక గణేశుని దర్శనం చేసుకున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే శిఖర్, జాన్వీ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది. జాన్వీ లాగే శిఖర్ పహారియా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ అప్ డేట్స్ ను ఇందులో షేర్ చేస్తుంటాడు. అలా తాజాగా గత సంవత్సరం దీపావళి వేడుకలకు సంబంధించిన ఒక ఫోటోను శిఖర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇందులో అతను తన పెట్ డాగ్ తో కనిపించాడు. అయితే ఈ ఫోటోకు ఒక నెటిజన్ ‘ మీరు దళితులు’ కదా? అని కామెంట్ పెట్టాడు.
నెటిజన్ కామెంట్ తో శిఖర్ కు చిర్రెత్తు కొచ్చింది. తన ఇన్ స్టా స్టోరీస్ లో ఆ కామెంట్ పోస్టు చేస్తూ ఇక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు. ‘2025లో కూడా నీలాంటి చిన్న, వెనకబడిన ఆలోచనలు ఉన్నవాళ్లు ఉండటం నిజంగా దురదృష్టకరం. భారతదేశం బలం దాని భిన్నత్వం, కలుపుగోలుతనంలో ఉంది. దీపావళి అనేది వెలుగు, అభివ్రుద్ధి, ఐక్యత పండగ. ఈ భావనలు నీ పరిమిత బుద్ధికి అందవు. ఇది నీకు అర్ధం కాదు. ఇలాంటి కామెంట్స్ తో నీ అజ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి బదులుగా, మీరు మిమ్మల్ని మీరు విద్యావంతులను చేసుకోవడంపై దృష్టి పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నిజంగా అంటరానిది మీ ఆలోచనా స్థాయి మాత్రమే’ అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు శిఖర్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట బాగా వైరలవుతోంది.
శిఖర్ పహరియా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు. అతని తల్లి స్మృతి షిండే ఒక నటి. ఇదిలా ఉండగా శిఖర్ అన్నయ్య వీర్ పహాడియా ఇటీవలే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆయన అక్షయ్ కుమార్ చిత్రం ‘స్కైఫోర్స్’లో నటుడిగా అరంగేట్రం చేశారు. ఇందులో ఆయన అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్ మరియు నిమ్రత్ కౌర్ లతో కలిసి నటించారు.
సిస్టర్ తో జాన్వీ కపూర్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి