AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sekhar Bhasha: బెట్టింగ్‌ యాప్స్‌ కేసులోకి శేఖర్ భాషా ఎంట్రీ.. ఆ ఇద్దరి తరుపున పోలీస్ స్టేషన్‏కు..

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌తో...బెట్టింగ్‌ యాప్‌ నిర్వాహకులు ప్రమోషన్లు చేయించారు. ఈ బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్లు లాభసాటిగా ఉండడంతో.. వాళ్లు వరుసబెట్టి వీడియోలు చేశారు. కొందరైతే చేతిలో డబ్బులు పట్టుకుని.. ఇవన్నీ బెట్టింగ్‌ యాప్స్‌ ద్వారానే సంపాదించాం అంటూ తమ ఫాలోవర్స్‌ను ప్రభావితం చేశారు.

Sekhar Bhasha: బెట్టింగ్‌ యాప్స్‌ కేసులోకి శేఖర్ భాషా ఎంట్రీ.. ఆ ఇద్దరి తరుపున పోలీస్ స్టేషన్‏కు..
Sekhar Bhasha
Rajitha Chanti
|

Updated on: Mar 18, 2025 | 9:14 PM

Share

ఇక మనుషుల ప్రాణాలు తీసేవాళ్లను ఏమంటాం? హంతకులు అంటాం. మరి బెట్టింగ్‌ యాప్‌లు ప్రమోట్‌ చేసి, యువత జేబులు గుల్ల చేసి, వాళ్లు అప్పులు పాలయ్యేలా చేసి, చివరకు ఆత్మహత్య చేసుకునేలా చేసేవాళ్లను ఏమంటాం? వాళ్లను కూడా కిల్లర్స్‌ అనే అంటాం కదా! బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్లు చేసి, యూత్‌ ఎమోషన్లతో ఆడుకుని, వాళ్ల జీవితాలు నాశనం అయ్యేలా చేసిన సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ భరతం పడుతున్నారు పోలీసులు. ఇన్నాళ్లు జనంతో ఆడుకున్న ఆ 11మంది ఇన్‌ఫ్లూయెన్సర్స్‌కి ఇప్పుడు…రివర్స్‌ గేమ్‌ స్టార్టయింది.

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌లో ఎవరెవరు బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేశారో చూద్దాం. విష్ణుప్రియ, టేస్టీ తేజ, సుప్రీత, రీతూ చౌదరి, హర్షసాయి, పరేషాన్‌ బాయ్స్‌ ఇమ్రాన్‌, కానిస్టేబుల్ కిరణ్‌గౌడ్, బయ్యా సన్నీ యాదవ్‌, లోకల్‌బాయ్‌ నాని, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌, శ్యామల.. మొత్తం 11మందికి వీళ్లందరికి నోటీసులు జారీ చేసి, కేసు నమోదు చేశారు హైదరాబాద్‌, పంజాగుట్ట పోలీసులు. విష్ణుప్రియ, టేస్టీ తేజ తరపున..పంజాగుట్ట పీఎస్‌కు వచ్చారు శేఖర్‌ బాషా. షూటింగ్‌ కారణంగా పోలీస్‌ విచారణకు సమయం కోరారు శేఖర్‌ బాషా. దీంతో మూడు రోజుల తర్వాత విచారణకు రావాలని విష్ణుప్రియ, టేస్టీ తేజలను పంజాగుట్ట పోలీసులు ఆదేశించారు.

పరేషాన్‌ బాయ్స్‌ ఇమ్రాన్‌ను త్వరలోనే అరెస్ట్‌ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇమ్రాన్‌ వీడియోలు జుగుప్సాకరంగా ఉన్నాయంటూ పోలీసులు చెబుతున్నారు. సమాజాన్ని పక్కదోవ పట్టించే వీడియోలతోపాటు.. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేస్తూ పలువురి ఆత్మహత్యకు కారకుడయ్యాడన్న ఆరోపణలున్నాయి. ఇక యూనిఫాంలో బెట్టింగ్‌ యాప్స్‌ని ప్రమోట్‌ చేశాడు కానిస్టేబుల్ కిరణ్‌గౌడ్. బయ్యా సన్నీ యాదవ్‌, లోకల్‌బాయ్‌ నాని వంటి వారిపై ఇప్పటికే అరెస్ట్‌ వారంట్లూ జారీఅయ్యాయి. లోకల్‌ బాయ్‌ నాని అరెస్టవ్వగా.. బయ్యా సన్నీ యాదవ్‌ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బిగ్‌ బాస్‌లో విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్‌ కూడా బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఆయనపైనా అభియోగాలున్నాయి.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..

సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.