AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: నాజుకు వయ్యారాల చిన్నది ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్.. ఫిట్‏నెస్‏లో ఈమెను మించినవారు లేరు..

ఆ సొగసరి తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా కానీ...అందం.. అభినయంతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. ఇక బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ గురించి చెప్పక్కర్లేదు. వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతుంది.

Tollywood: నాజుకు వయ్యారాల చిన్నది ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్.. ఫిట్‏నెస్‏లో ఈమెను మించినవారు లేరు..
Actress
Rajitha Chanti
|

Updated on: Jan 15, 2023 | 7:57 PM

Share

ప్రస్తుతం హీరోయిన్స్ వెకేషన్స్ అంటూ విదేశాల్లో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక అక్కడి నుంచి ముద్దుగుమ్మలు షేర్ చేసే ఫోటోస్ నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే కీర్తి సురేష్, రష్మిక మందన్నా పోస్ట్ చేసిన పిక్చర్స్ వైరల్ కాగా.. తాజాగా ఓ హీరోయిన్ షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. నాజుకు వయ్యారాలతో నడిరోడ్డుపై ఫోటోలకు ఫోజులిచ్చింది. పైన పిక్చర్ చూశారు కదా. ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టండి. ఆ సొగసరి తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా కానీ…అందం.. అభినయంతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. ఇక బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ గురించి చెప్పక్కర్లేదు. వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతుంది. అంతేకాకుండా.. ఈ హీరోయిన్ ప్రేమాయణం గురించి నిత్యం వార్తలు వస్తుంటాయి. గుర్తుపట్టండి. ఈ హీరోయిన్ మరెవరో కాదు.. బీటౌన్ బ్యూటీ దిశా పటానీ.

తెలుగులో 2015లో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది దిశా. ఆ తర్వాత సుశాంత్ నటించిన ఎంఎస్ ధోనీ చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత వెల్ కమ్ న్యూయార్క్, భాగీ 2, భారత్, మాలంగ్, ఎక్ విలన్ రిటర్న్స్, చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో యోధ, ప్రాజెక్ట్ కె, శివ చిత్రాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

అయితే దిశా పటానీ భాగీ 2 ఫేమ్ టైగర్ ష్రాఫ్ తో ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే వీరిద్దరు విడిపోయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం దిశా.. అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్‌తో ప్రేమలో ఉన్నట్లుగా బీటౌన్ లో టాక్ నడుస్తోంది. అయితే తమ రిలేషన్ షిప్ గురించి వస్తున్న రూమర్స్ పై ఇప్పటివరకు వీరిద్దరు స్పందించలేదు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us