AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET UG 2026 re-exam Date: నీట్‌ పేపర్ లీక్‌పై CBI కేసు.. వచ్చే 10 రోజుల్లోగా నీట్‌ రీఎగ్జామ్‌ షెడ్యూల్‌ విడుదల

పేపర్ లీక్ ఆరోపణల కారణంగా నీట్-యూజీ 2026 కేసును సీబీఐకి అప్పగించినట్లు ఎన్‌టీఏ డీజీ అభిషేక్ సింగ్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రతికూలంగా ప్రభావితం కాకుండా ఉండేందుకు, నిందితులందరినీ పట్టుకుని జైలుకు పంపుతాయని ఆయన అన్నారు. విద్యార్థులకు NTA పునఃపరీక్ష నిర్వహిస్తుందని అన్నారు..

NEET UG 2026 re-exam Date: నీట్‌ పేపర్ లీక్‌పై CBI కేసు.. వచ్చే 10 రోజుల్లోగా నీట్‌ రీఎగ్జామ్‌ షెడ్యూల్‌ విడుదల
NEET UG paper leak Row
Srilakshmi C
|

Updated on: May 13, 2026 | 7:04 PM

Share

హైదరాబాద్, మే 13: పేపర్ లీక్, అవకతవకల ఆరోపణల నేపథ్యంలో మే 3, 2026న జరిగిన నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్-యూజీ) 2026 పరీక్షను కేంద్రం మంగళవారం రద్దు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో 5,432కు పైగా కేంద్రాల్లో సుమారు 22.79 లక్షల మంది ఈ పరీక్ష రాశారు. నీట్‌ పరీక్షలో 720 మార్కులకు 180 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున కేటాయిస్తారు. అయితే మే 1వ తేదీన నీట్ ప్రశ్నాపత్రంలోని దాదాపు 120 ప్రశ్నలు బయటకు వచ్చాయి. సంవత్సరాలుగా ప్రిపేర్‌ అయిన విద్యార్ధులు కేంద్రం తాజా నిర్ణయంతో సందిగ్ధంలో పడ్డారు.

అయితే త్వరలోనే నిర్వహించబోయే నీట్‌ రీటెస్ట్ పరీక్ష తేదీలను విడిగా ప్రకటిస్తామని ఎన్టీయే తాజాగా ప్రకటింది. అంతేకాకుండా మే 2026 సైకిల్‌లో ఎంచుకున్న రిజిస్ట్రేషన్ డేటా, అభ్యర్థిత్వం, రీక్షా కేంద్రాల ప్రకారమే నీట్ పరీక్ష తిరిగి నిర్వహిస్తామని ఎన్టీయే ప్రకటించింది. ఈ మేరకు నీట్ యూజీ 2026 కొత్త షెడ్యూల్‌ను రాబోయే 7-10 రోజుల్లో ప్రకటిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ స్పష్టం చేశారు.

మరోవైపు నీట్ పేపర్‌లీక్‌పై సీబీఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది. పేపర్ లీక్ ఆరోపణల కారణంగా నీట్-యూజీ 2026 కేసును సీబీఐకి అప్పగించినట్లు ఎన్‌టీఏ డీజీ అభిషేక్ సింగ్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రతికూలంగా ప్రభావితం కాకుండా ఉండేందుకు, నిందితులందరినీ పట్టుకుని జైలుకు పంపుతాయని ఆయన అన్నారు. విద్యార్థులకు NTA పునఃపరీక్ష నిర్వహిస్తుందని, ఈ పునఃపరీక్షకు అదనపు రుసుము వసూలు చేయమని, అలాగే మొదటి పరీక్షకు వసూలు చేసిన రుసుమును కూడా ఏజెన్సీ వాపసు చేస్తుందని వెల్లడించారు. గెస్ పేపర్ పేరిట నీట్ క్వశ్చన్‌ పేపర్‌లోని 120 ప్రశ్నలు అచ్చుగుద్దినట్లు ఉన్న చేతిరాతతో ఉన్న ఓ మెటిరియల్‌ మే 1న దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చక్కర్లు కొట్టింది. ఈ మెటీరియల్‌లో మొత్తం 400 ప్రశ్నలు ఉండగా.. అందులో 600 మార్కులు కలిగిన 120 ప్రశ్నాపత్రంలోనివే కావడం విశేషం. ఆన్సర్‌లతోపాటు ఉన్న ఈ మెటీరియల్ రాజస్థాన్‌ నుంచి పలు రాష్ట్రాలకు వేగంగా పంపిణీ అయింది. ఒకటి విద్యార్థుల మధ్య ప్రచారంలో ఉందని వచ్చిన నివేదికలపై రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) దర్యాప్తు ప్రారంభించింది. నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత వైద్య సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్ జె నాయక్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us