JEE Advanced 2026 Admit Card: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డులు విడుదల.. డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్ ఇదిగో
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026' పరీక్ష మరో వారంలో జరగనుంది. ఈ క్రమంలో ఐఐటీ రూర్కీ సోమవారం (మే 11) అడ్మిట్ కార్డులు విడుదల చేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ తమ వివరాలను నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్..

హైదరాబాద్, మే 11: దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)ల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించే ‘జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026’ పరీక్ష మరో వారంలో జరగనుంది. ఈ క్రమంలో ఐఐటీ రూర్కీ సోమవారం (మే 11) అడ్మిట్ కార్డులు విడుదల చేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ తమ వివరాలను నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వివరాలను నమోదు చేసి అడ్మిట్ కార్డులను పొందొచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు సంబంధించిన అడ్మి్‌ట్ కార్డులు మే 17వ తేదీ వరకు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు తమ పేరు, ఫోటో, సంతకం, రోల్ నంబర్ వంటి వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలి. వీటిల్లో ఏదైనా తప్పులు ఉంటే వెంటనే సంబంధిత జోనల్ ఐఐటీ చైర్మన్‌కు ఫిర్యాదు చేసి, వెంటనే సవరించుకోవాలని ఐఐటీ రూర్కీ స్పష్టం చేసింది.
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష మే 17, 2026వ తేదీన దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో రెండు షిఫ్టుల్లో జరగనుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు జరగనున్నాయి. PwD అభ్యర్ధులకు అదనంగా గంట సమయం కేటాయిస్తారు. పరీక్ష ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు చొప్పున కోత విధిస్తారు. అభ్యర్ధులు తప్పనిసరిగా రెండు పేపర్లకు హాజరుకావల్సి ఉంటుంది. ఇక జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు జూన్ 1, 2026 ఉదయం 10 గంటలకు ఎన్టీయే విడుదల చేస్తుంది. అనంతరం జోసా కౌన్సెలింగ్ జూన్ 2 నుంచి మొదలవుతుంది.
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అనంతరం జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైన వారికి ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ 2026) నిర్వహిస్తారు. ఈ పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తులు జూన్ 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఏఏటీ 2026 పరీక్ష జూన్ 4వ తేదీ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. జూన్ 7న ఏఏటీ 2026 పరీక్ష ఫలితాలు విడుదలవుతాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




