AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గౌతమ్ గంభీర్ వైట్ హౌస్ చూశారా..? మేన్షన్ ధర తెలిస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే

పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత, భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో ఇండియా 2026 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఇటీవల తన కుటుంబంతో కలిసి వైష్ణో దేవిని దర్శించుకున్న గంభీర్, మైదానంలో ఎంత కఠినంగా ఉంటారో, తన ఇంటి విషయంలో అంత అభిరుచిని కలిగి ఉంటారు. ఢిల్లీలోని ఆయన నివాసం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

గౌతమ్ గంభీర్ వైట్ హౌస్ చూశారా..? మేన్షన్ ధర తెలిస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
Gambhir With Family
Nikhil
|

Updated on: May 13, 2026 | 7:00 PM

Share

గౌతమ్ గంభీర్ తన భార్య నటాషా, కుమార్తెలు ఆజీన్, అనైజాలతో కలిసి ఢిల్లీలోని ఒక అద్భుతమైన రెండు అంతస్తుల వైట్ బంగళాలో నివసిస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఈ మేన్షన్ విలువ దాదాపు రూ. 20 కోట్లు. ఐవరీ రంగు ఇంటీరియర్ తో, అత్యంత విలాసవంతంగా డిజైన్ చేయబడిన ఈ ఇల్లు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.

మినిమల్ డెకర్.. రాయల్ లుక్

గంభీర్ నివాసంలో అడుగుపెట్టగానే మనకు కనిపించేది ఐవరీ రంగు డెకర్. ఇది ఇంటికి విలాసవంతమైన లుక్ ఇవ్వడమే కాకుండా, అక్కడ వాడిన చెక్క పనితనానికి చక్కటి మెరుగులు దిద్దుతుంది. ఈ ఇంటి ప్రత్యేకత విశాలమైన గ్రీన్ లాన్. చుట్టూ చెట్లు, కుండీలలోని మొక్కలతో ఈ ఉద్యానవనం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. గంభీర్ తన కుమార్తెలు, పెంపుడు కుక్కలతో ఇక్కడ సమయం గడపడానికి ఇష్టపడతారు.

ఇంటి పైకప్పు మధ్యలో స్కైలైట్ ఏర్పాటు చేయడం వల్ల, కాలంతో సంబంధం లేకుండా ఇల్లంతా సహజమైన వెలుతురుతో నిండి ఉంటుంది. లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్ ఓపెన్ ప్లాన్ లేఅవుట్ తో కలిసి ఉంటాయి. బేజ్, వైట్ మరియు పౌడర్ బ్లూ టోన్ల కలయికతో ఈ గదులు ఎంతో హుందాగా కనిపిస్తాయి.

క్రికెట్ జ్ఞాపకాల గని

గంభీర్ ఇంట్లో అత్యంత ఆకర్షణీయమైన భాగం ‘లాంజ్ ఏరియా’. ఇది కేవలం విశ్రాంతి తీసుకునే ప్రదేశం మాత్రమే కాదు, ఆయన క్రికెట్ కెరీర్ కు సంబంధించిన జ్ఞాపకాల భాండాగారం. 2007 టీ20 వరల్డ్ కప్ జ్ఞాపికతో పాటు, తన సుదీర్ఘ కెరీర్ లో అందుకున్న మెడల్స్, ట్రోఫీలు, సంతకం చేసిన బ్యాట్లు, జెర్సీలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గంభీర్ బెడ్ రూమ్ లో నేల నుండి పైకప్పు వరకు ఉండే కిటికీలు, లేయర్డ్ కర్టెన్లు ఒక రాయల్ ఫినిషింగ్ ను ఇస్తాయి.

అలాగే తన కుమార్తెల కోసం పింక్ కలర్ థీమ్ తో ప్రత్యేకంగా గదిని డిజైన్ చేయించారు. వారు పెద్దయ్యాక కూడా ఆ డిజైన్ బోర్ కొట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తానికి గౌతమ్ గంభీర్ ఇల్లు సౌకర్యానికి, ఆధునిక ఇంటీరియర్ డిజైన్ కు ఒక నిలువుటద్దంలా నిలుస్తుంది.

Follow Us