Bigg Boss Telugu: శ్రీకృష్ణుడి వేషంలో తళుక్కుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?
పేరుకు కన్నడ నటినే అయినా తెలుగు ఆడియెన్స్ కు ఈ ముద్దుగుమ్మ బాగా పరిచయం. పలు సూపర్ హిట్ సీరియల్స్ లో నటించింది. అలాగే బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలోనూ సందడి చేసింది. తన ఆట, మాట తీరుతో టాప్-5లో కంటెస్టెంట్స్ లో నిలిచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంటోంది.

ముంబయిలో జన్మించింది. బెంగళూరులో చదువుకుంది. మాతృభాష హిందీ అయినప్పటికీ తెలుగుతో పాటు కన్నడ వంటి భాషలను అనర్గళంగా మాట్లాడుతుంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ కొన్ని తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లోనూ నటించింది. అయితే పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. పలు సూపర్ హిట్ సీరియల్స్ లో నటించింది. తన దైన అందం, అభినయంతో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. అలాగే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోనూ సందడి చేసింది. విజేతగా నిలవకున్నా తన దైన ఆట, మాట తీరుతో టాప్-5లో కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచింది. ప్రస్తుతం పలు టీవీ షోస్, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీ బిజీగా ఉంటోందీ అందాల తార. ఇక సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. అలా తాజాగా ఆమె కృష్ణుడి వేషధారణలో దిగిన కొన్ని ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో ఎంతో క్యూట్ గా, అందంగా కనిపించిందీ ముద్దుగుమ్మ. నెటిజన్లు కూడా లైక్స్, షేర్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ సొగసరి ఎవరో గుర్తు పట్టారా?
పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు బిగ్ బాస్ తెలుగు సీజన్-7 కంటెస్టెంట్ ప్రియాంక జైన్. మౌనరాగం సీరియల్ తో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైందీ ముద్దుగుమ్మ. అందులో ఆమె పోషించిన జానకి పాత్ర తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఆ తర్వాత ‘జానకి కలగనలేదు’ సీరియల్ తో ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అంతకు ముందు గోలీసోడా, ఛల్ తే ఛల్ తే వంటి సినిమాల్లోనూ యాక్ట్ చేసిందీ అందాల తార. అలాగే గతేడాది నయనం అనే తెలుగు వెబ్ సిరీస్ లోనూ ఒక కీలక పాత్ర చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టీవీ షోస్ తో పాటు ప్రకటనల్లోనూ నటిస్తోంది. అందులో భాగంగానే ఒక జ్యూవెలరీ యాడ్ కోసం ఇలా కృష్ణుని గెటప్ లో దర్శనమిచ్చింది.
శ్రీకృష్ణుడి వేషధారణలో ప్రియాకం జైన్..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




