AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాకాలం స్కూల్ పిల్లల బ్యాగులో ఇవి కంపల్సరీ పెట్టండి.. తల్లిదండ్రులు అస్సలు లైట్ తీసుకోవద్దు..

వర్షాకాలం చల్లదనాన్ని తీసుకొచ్చినప్పటికీ.. స్కూల్‌కు వెళ్లే పిల్లలు, వారి తల్లిదండ్రులు కొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా స్కూలుకు వెళ్లే పిల్లల్లో బూట్లు లేదా సాక్సులు తడవడం, నోట్‌బుక్‌లు పాడైపోవడం, చేతుల పరిశుభ్రత లోపించడం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడటం వంటి సమస్యలు వస్తుంటాయి. అయితే కొన్ని ముందస్తు జాగ్రత్తలతో ఈ సమస్యలను సులభంగా అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మీ పిల్లలు రోజూ స్కూల్ వెళుతుంటే.. వారి బ్యాగులో ఈ వస్తువులను కంపల్సరీ పెట్టండి.

Krishna S
|

Updated on: Jul 20, 2026 | 6:26 PM

Share
చిన్న గొడుగు లేదా తేలికపాటి రెయిన్‌కోట్: వర్షాకాలంలో వాతావరణం ఎప్పుడు మారుతుందో అంచనా వేయడం కష్టం. బడికి వెళ్లే సమయంలో లేదా తిరిగి వచ్చేటప్పుడు అకస్మాత్తుగా వర్షం పడితే పిల్లలు తడవకుండా ఉండటానికి వారి బ్యాగులలో తేలికైన, సులభంగా మడతపెట్టే గొడుగు లేదా చిన్న రెయిన్‌కోట్‌ను ఎప్పుడూ సిద్ధంగా ఉంచాలి.

1 / 5
అదనపు సాక్సులు, చిన్న టవల్: ప్రయాణంలో లేదా స్కూల్ మైదానంలో ఆడుకునేటప్పుడు సాక్సులు, బూట్లు తడిసిపోవడం సహజం. రోజంతా తడి సాక్సులతో ఉంటే పిల్లలు జబ్బుపడే ప్రమాదం ఉంది. అందుకే బ్యాగులో ఒక జత అదనపు పొడి సాక్సులు ఉంచాలి. అలాగే తడిచిన చేతులు, ముఖం లేదా జుట్టును తుడుచుకోవడానికి ఒక చిన్న టవల్ లేదా శుభ్రమైన చేతి రుమాలు ఎంతో ఉపయోగపడుతుంది.

2 / 5
హ్యాండ్ శానిటైజర్, టిష్యూలు: వర్షాకాలంలో బ్యాక్టీరియా, వైరస్‌లు వేగంగా వ్యాప్తి చెందుతాయి. అందుకే పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. పిల్లలు తినడానికి ముందు లేదా అవసరమైనప్పుడు చేతులను కడుక్కోవడానికి బ్యాగ్‌లో హ్యాండ్ శానిటైజర్, టిష్యూలు ఉంచాలి. అలాగే బయటి నీటిని తాగి రోగాల బారిన పడకుండా ఇంటి నుంచే వాటర్ బాటిల్ పంపాలి.

3 / 5
ఆరోగ్యకరమైన చిరుతిండి, ఐడెంటిటీ: వర్షాల కారణంగా కొన్నిసార్లు ట్రాఫిక్ జామ్ అయ్యి పిల్లలు ఇంటికి రావడం ఆలస్యం కావచ్చు. అలాంటి సమయంలో ఆకలి వేయకుండా ఉండటానికి బ్యాగులో తేలికపాటి స్నాక్స్ పెట్టడం మంచిది. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో, అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించడానికి వీలుగా వారి పేరు, తరగతి, తల్లిదండ్రుల ఫోన్ నంబర్, ఇంటి చిరునామా ఉన్న ఒక గుర్తింపు కార్డును బ్యాగ్‌లో ఉంచడం మరిచిపోకండి.

4 / 5
వాటర్ ప్రూవ్ బ్యాగ్స్ : వర్షం తీవ్రతకు స్కూల్ బ్యాగ్‌లోకి తేమ చేరి పుస్తకాలు పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి పిల్లల నోట్‌బుక్‌లు, టెక్స్ట్‌బుక్స్ మరియు ఐడెంటిటీ కార్డులను వాటర్‌ప్రూఫ్ పౌచ్‌లు లేదా జిప్ లాక్ బ్యాగులలో ఉంచి పంపడం సురక్షితం. చిన్న నిర్లక్ష్యం సైతం మీ పిల్లలను రోగాల బారిన పడేలా చేస్తుంది. అందుకే ముందు జాగ్రత్తలు చాలా ముఖ్యం.

5 / 5
Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?