Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood : ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి.. శోకసంద్రంలో హీరోయిన్..

బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు దేబ్ ముఖర్జీ కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తండ్రే దేబ్ ముఖర్జీ..

Bollywood : ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి.. శోకసంద్రంలో హీరోయిన్..
Rani Mukherjee
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 14, 2025 | 1:16 PM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మామ, ప్రముఖ నటుడు దేబ్ ముఖర్జీ కన్నుమూశారు. హిందీ చిత్రపరిశ్రమలోని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తండ్రి దేబ్ ముఖర్జీ. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈరోజు పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూసినట్లు సమాచారం. ప్రస్తుతం దేబ్ ముఖర్జీ వయసు 83 సంవత్సరాలు. ఆయన మృతితో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. సినీప్రముఖులు, అభిమానులు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు. సోషల్ మీడియా ద్వారా దేబ్ ముఖర్జీకి నివాళులర్పిస్తున్నారు.

‘తు హి మేరీ జిందగీ’, ‘ఆన్సు బన్ గయే ఫూల్’, ‘అభినయీ’, ‘జో జీతా వోహి సికందర్’, ‘కామినీ’ వంటి అనేక చిత్రాలలో ముఖ్య పాత్రలు పోషించి.. అద్భుతమైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నాడు దేబ్ ముఖర్జీ. గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ముఖర్జీ కుటుంబంలోని నాలుగు తరాలు బాలీవుడ్‌ను ఏలాయి.

ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్ తో దేబ్ ముఖర్జీకి ప్రత్యేక అనుబంధం ఉంది. దేబ్ ముఖర్జీ కాజోల్ మామ. ‘లగాన్’ వంటి అనేక విజయవంతమైన చిత్రాల దర్శకుడు అశుతోష్ గోవారికర్ ఆయనకు అల్లుడు. దేబ్ ముఖర్జీ అనేక చిత్రాలలో పనిచేశారు. పరిశ్రమలోని ప్రజలు అతన్ని దేబు దా అని పిలుస్తారు. దేబ్ ముఖర్జీ మనవడు, అశుతోష్ గోవారికర్ కుమారుడు కోణార్క్ గోవారికర్ మార్చి 2న వివాహం చేసుకున్నాడు. అనారోగ్యం కారణంగా దేబ్ వివాహానికి హాజరు కాలేకపోయాడు. ఈ వివాహానికి షారుఖ్ ఖాన్ సహా చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది తారలు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..