Virat Kohli- Anushka Sharma: ‘నీ ప్రేమ పొందినందుకు రుణపడి ఉంటా’.. కోహ్లీ రికార్డు సెంచరీపై అనుష్క ఎమోషనల్
మ్యాచ్ అనంతరం తన రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీని సచిన్ టెండూల్కర్ కౌగిలించుకుని ఆనందం వ్యక్తం చేశాడు. ఇక సెంచరీ పూర్తి చేయగానే స్టేడియంలో ఉన్న తన భార్య అనుష్క వైపు చూస్తూ గాల్లో ముద్దులు విసిరేశాడు కోహ్లీ. ఇక మ్యాచ్ అనంతరం తన కోహ్లీపై ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది అనుష్క. ఇన్‌స్టా గ్రామ్ వేదికగా..

ఊహించినట్లుగానే ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023లో భారత క్రికెట్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం (నవంబర్ 15) ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా న్యూజిలాండ్‌పై 70 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా గత ప్రపంచకప్ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకున్నట్లయింది. భారత్ తరఫున బౌలింగ్‌లో మహ్మద్ షమీ 7 వికెట్లు తీయగా, బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ సెంచరీలతో రాణించారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ 50వ వన్డే సెంచరీలు సాధించి సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. కోహ్లీ సాధించిన ఘనతపై ప్రపంచ క్రీడా దిగ్గజాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇక మ్యాచ్ అనంతరం తన రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీని సచిన్ టెండూల్కర్ కౌగిలించుకుని ఆనందం వ్యక్తం చేశాడు. ఇక సెంచరీ పూర్తి చేయగానే స్టేడియంలో ఉన్న తన భార్య అనుష్క వైపు చూస్తూ గాల్లో ముద్దులు విసిరేశాడు కోహ్లీ. ఇక మ్యాచ్ అనంతరం తన కోహ్లీపై ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది అనుష్క. ఇన్‌స్టా గ్రామ్ వేదికగా ‘దేవుడు ఉత్తమ స్క్రిప్ట్ రైటర్! మీ ప్రేమతో పాటు విరాట్ కోహ్లీ ప్రేమను ఆశీర్వదించినందుకు నేను కృతజ్ఞురాలిని. మనసులోనూ, ఆటపై నిజాయతీగా ఉండే నువ్వు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తావు. నువ్వు నిజంగా దేవుడి బిడ్డవు’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది అనుష్క. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో 117 పరుగులు చేయడం ద్వారా వన్డే ప్రపంచకప్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన టెండూల్కర్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. 2003లో సచిన్ 673 పరుగులు చేయగా, 2023 వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ 10 మ్యాచ్‌ల్లో మొత్తం 711 పరుగులు చేశాడు. ఇక తన రికార్డులను కోహ్లీ బద్దలు కొట్టడంపై సచిన్ స్పందిస్తూ ‘ నేను నిన్ను (విరాట్ కోహ్లీ) మొదటిసారి భారత డ్రెస్సింగ్ రూమ్‌లో కలిసినప్పుడు, ఇతర సహచరులు నా పాదాలను తాకి నమస్కరించాలని ప్రాంక్ చేశారు. నేను కూడా నవ్వు ఆపుకోలేకపోయాను. కానీ ఈరోజు నువ్వు నా మనసును తాకావు. అప్పటి చిన్న కుర్రాడు ‘విరాట్’గా ఎదగడం చూసి చాలా సంతోషంగా ఉంది ‘ అని ట్వీట్ చేశాడు సచిన్.




అనుష్కా శర్మ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.