AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka Chopra: బోరున విలపించిన ప్రియాంక చోప్రా.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Priyanka Chopra: మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Priyanka Chopra: బోరున విలపించిన ప్రియాంక చోప్రా.. ఇంతకీ ఏం జరిగిందంటే..
Priyanka Chopra
Shiva Prajapati
|

Updated on: Aug 02, 2022 | 5:10 PM

Share

Priyanka Chopra: మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బీ టౌన్‌లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా, దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ఈ బ్యూటీ.. దేశ వ్యాప్తంగానే కాక, ప్రపంచ వ్యాప్తంగానూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఆ క్రేజ్‌ ఆమెను బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌ లెవల్‌కు తీసుకెళ్లింది. క్వాంటికో, ఎ కిడ్ లైక్ జేక్, బే వాచ్ వంటి హాలీవుడ్ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. బాలీవుడ్‌లోనూ తగ్గేదేలే అంటోంది. ప్రస్తుత ప్రియాంకా చోప్రా చేతిలో జీ లే జరా, షీలా, కల్పనా చావ్ల బయోపిక్ వంటి పలు సినిమాలు ఉండగా.. వాటి షూటింగ్ కొనసాగుంతోంది.

ప్రియాంక చొప్ప మంచి నటి మాత్రమే కాదు.. మంచి మనసున్న స్త్రీ కూడా. అమ్మతనం తెలిసిన ప్రియాంక చొప్రా.. పసి పిల్లల విషయంలో చాలా సున్నితంగా ఉంటుంది. యునిసఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ప్రియాంక చోప్రా ఉంది. తాజాగా ఓ దృశ్యాన్ని చూసి ప్రియాంక చోప్రా బోరున విలపించింది. కొందరు చిన్నారులను హత్తుకుని కన్నీటి పర్యంతం అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్న ప్రియాంక చోప్రా తాజాగా పోలాండ్‌ను సందర్శించింది. అక్రడ రష్యా దాడి కారణంగా నిరాశ్రయులైన ఉక్రెయిన్‌కు చెందిన కొందరు చిన్నారులను, మరికొందరిని కలిసింది. ఆ చిన్నారుల ధీన స్థితికి చలించిపోయిన ప్రియాంక.. కన్నీరు పెట్టుకుంది. వారిని హత్తుకుని ఏడ్చేసింది. అనంతరం వారిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని, వారితో కాసేపు సరదాగా గడిపింది. బాధిత పిల్లలతో ఆటలాడింది. డ్రాయింగ్, పెయింటింగ్ వంటి కార్యకలాపాల్లో పాల్గొంది. కొందరు చిన్నారులు చేతితో చేసిన బొమ్మలను ప్రియాంక చోప్రాకు బహుమతిగా ఇచ్చారు. వాటికి పేర్లు పెట్టాల్సిందిగా కోరారు. అలా చిన్నారులతో గడిపిన క్షణాలను ప్రస్తావిస్తూ ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రమ్‌లో ఒక వీడియో పోస్ట్ చేసింది. దానికి క్యాప్షన్ కూడా పెట్టింది. ఉక్రెనియన్ల అవస్థలను వివరిస్తూ, వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆ పోస్ట్‌లో ప్రస్తావించింది ప్రియాంక చోప్రా.

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

మరిన్ని ఎంటర్‌టైన్మెంట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..