Taapsee Pannu: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్‌పై ఇప్పటికీ చిన్నచూపే.. హీరోయిన్ తాప్సీ సంచలన కామెంట్స్
తాజాగా హీరోల గురించి తాప్సీ చేసిన కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్‌గా పుష్కరకాలం పూర్తి చేసుకున్న తాప్సీ, ఇప్పటికీ తన కెరీర్ విషయంలో సంతృప్తిగా లేనని చెబుతున్నారు.
Actress Taapsee Pannu News: ఎవరు ఎన్ని చెప్పినా సినీ ఇండస్ట్రీ మేల్ డామినేటెడ్ ఫీల్డే అంటున్నారు నటి తాప్సీ. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సత్తా చాటుతున్న ఈ బ్యూటీ… ఇప్పటికీ తమను చిన్న చూపు చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా హీరోల గురించి తాప్సీ చేసిన కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్‌గా పుష్కరకాలం పూర్తి చేసుకున్న తాప్సీ, ఇప్పటికీ తన కెరీర్ విషయంలో సంతృప్తిగా లేనని చెబుతున్నారు. ఈ సందర్భంగా కెరీర్ స్టార్టింగ్‌లో తనకు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకొని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో హీరోయిన్‌కు ఇచ్చే కేరవాన్‌లు అగ్గిపెట్టేలా ఉండేవన్న తాప్సీ… హీరోలకు మాత్రం డబుల్ డోర్ వ్యాన్‌లను ఎరేంజ్ చేసేవారని చెప్పారు.
అప్పుడే కాదు.. ఇప్పటికీ ఇండస్ట్రీలో పరిస్థితి ఇలాగే ఉందంటున్నారు ఈ స్టార్ హీరోయిన్. సోలో లీడ్‌గా సూపర్ హిట్ ఇచ్చిన హీరోయిన్‌కు ఇస్తున్న పేమెంట్… ఓ ఫ్లాప్ హీరోకు ఇస్తున్న దాంట్లో 10 పర్సెంట్ కూడా ఉండదని ఇండస్ట్రీ ఇన్ సైడ్ సిచ్యుయేషన్‌ను తాప్సీ రివీల్ చేశారు.
మార్పు తనతోనే మొదలు కావాలని ఫిక్స్ అయ్యిన తాప్సీ.. స్వయంగా నిర్మాతగా మారి సినిమాలు రూపొందిస్తున్నారు. తన ప్రొడక్షన్‌లో వస్తున్న సినిమాల షూటింగ్ సమయంలో ఎలాంటి వేరియేషన్స్ లేకుండా మేల్ అండ్ ఫీమేల్ ఆర్టిస్ట్‌లకు ఈక్వల్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు. కార్వాన్‌ల నుంచి పేమెంట్ వరకు ప్రతీ విషయంలో క్యారెక్టర్… సీనియారిటీ బేసిస్‌లోనే ఫెసిలిటీస్ కల్పించేలా ఏర్పాట్లు చేశారు.
ఎలాంటి ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేకుండా బాలీవుడ్‌లో సక్సెస్ అయిన తాప్సీ.. తన కెరీర్ గ్రాఫ్‌ను రిప్రజెంట్ చేసేలా ఔట్ సైడర్స్ ఫిలింస్ పేరుతో ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఈ బ్యానర్‌లో బ్లర్, ధక్ ధక్ అనే సినిమాలు చేస్తున్నారు. నెక్ట్స్ సమంత లీడ్ రోల్‌లో పాన్ ఇండియా మూవీ నిర్మించే ఆలోచనలో ఉన్నారు తాప్సీ.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తలు చదవండి