AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సమంతపై ఫైర్ అవుతున్న చై అభిమానులు.. దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చిన సామ్..

Samantha: నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకుని కొన్ని నెలులు అవుతున్నప్పటికీ.. వీరిద్దరి టాపిక్ మాత్రం నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది.

Samantha: సమంతపై ఫైర్ అవుతున్న చై అభిమానులు.. దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చిన సామ్..
Samantha
Shiva Prajapati
|

Updated on: Aug 02, 2022 | 6:08 PM

Share

Samantha: నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకుని కొన్ని నెలులు అవుతున్నప్పటికీ.. వీరిద్దరి టాపిక్ మాత్రం నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. దానికి కారణం వారి అభిమానులే అని చెప్పుకోవాలి. డైవర్స్ తరువాత ఎవరి కెరీర్‌లో వారు సమంత, నాగచైతన్య బిజీ అయిపోగా.. ఫ్యాన్స్ మాత్రం నిత్యం ఆ విడాకుల మ్యాటర్‌నే ప్రస్తావిస్తూ రచ్చ చేస్తున్నారు. తాజాగా మరో అంశం తెరమీదకు వచ్చింది. గత కొంతకాలంగా హీరో నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. వారిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతమై ప్రచారం చేస్తున్నారు.

ఇక ఈ ప్రచారానికి సమంత పీఆర్ టీమే కారణం అంటూ చైతన్య ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కావాలనే నాగచైతన్యపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఈ విషయంలో సమంతను తెగ ట్రోల్ చేస్తున్నారు. అయితే, ఈ ట్రోల్స్‌పై సమంత సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. తనను ట్రోల్ చేస్తున్న వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ‘అమ్మాయిపై వచ్చిన పుకార్లు నిజమే! అబ్బాయిపై వచ్చిన పుకార్లు మాత్రం అమ్మాయి ద్వారా ప్రచారం చేయబడ్డాయి!! కాస్త ఎదగండి బాబులు. సంబంధిత వ్యక్తులు ముందుకు కదిలారు. మీరు కూడా ముందుకు సాగాలి. మీరు కూడా ముందకు సాగాలి. మీ పనిపై దృష్టి పెట్టండి. మీ కుటుంబాలను చూసుకోండి. ముందకు సాగండి.!!’ అంటూ ట్వీట్ చేసింది సామ్. ఈ ట్వీట్ పాతదే అయినా.. ఇప్పుడు మళ్లీ ట్రోల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. సామ్ ఫ్యాన్ ఆమెకు సపోర్ట్ చేస్తుంటే.. నాగ చైతన్య ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ఎలా ఉన్నా.. విడాకులు తీసుకున్న వారిద్దరూ బాగానే ఉన్నారు కానీ, మిగతావారే తెగ ఇబ్బంది పడిపోతున్నారంటూ సమంత పరోక్షంగా కామెంట్ చేసింది. ఇక ఇటీవల కాఫీ విత్ కరణ్‌ షో లో నాగ చైతన్యతో విడాకుల విషయం ప్రస్తావించగా సమంత మౌనం పాటించిన విషయం తెలిసిందే.

2021లో సమంత, నాగ చైతన్య తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. పెళ్లయిన నాలుగు సంవత్సరాల తరువాత ఈ జంట విడాకులు తీసుకుంది. వీరిద్దరూ పరస్పర అంగీకారంతోనే డైవర్స్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. వీరిద్దరూ సపరేట్ అయ్యాక.. ఎవరి కెరీర్లో వారు ఫుల్ బిజీ అయిపోయారు. వరుస సినిమాలతో సామ్, చై దూసుకుపోతున్నారు. అయితే, వీరిద్దరూ విడిపోవడం.. ఫ్యాన్స్ జీర్ణించుకోలేపోయారు. సామ్, చై మళ్లీ కలవాలంటూ అభిమానులు చాలా గట్టిగా కోరుకున్నారు.

మరిన్ని ఎంటర్‌టైన్మెంట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గంభీర్‌ను చూసి ఎక్స్‌ప్రెషన్ మార్చేసిన కోహ్లీ..అసలు ఏం జరుగుతోంది
గంభీర్‌ను చూసి ఎక్స్‌ప్రెషన్ మార్చేసిన కోహ్లీ..అసలు ఏం జరుగుతోంది
రాత్రి వేళల్లో తినకూడని ఫ్రూట్స్ ఇవే!
రాత్రి వేళల్లో తినకూడని ఫ్రూట్స్ ఇవే!
యోగాతో గుండెపోటుకు చెక్.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన అద్భుత ఆసనాలు
యోగాతో గుండెపోటుకు చెక్.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన అద్భుత ఆసనాలు
రూ.10,000 EMIతో టాటా నెక్సాన్ కొనొచ్చు.. ఎన్నేళ్లు చెల్లించాలి?
రూ.10,000 EMIతో టాటా నెక్సాన్ కొనొచ్చు.. ఎన్నేళ్లు చెల్లించాలి?
హాట్ చాక్లెట్ తాగితే వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసా
హాట్ చాక్లెట్ తాగితే వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసా
ఆర్ఆర్ఆర్‌లో ఈ గొండు జాతి మహిళ గుర్తుందా.?
ఆర్ఆర్ఆర్‌లో ఈ గొండు జాతి మహిళ గుర్తుందా.?
హైదరాబాదులోని ఆ రోడ్డుకి డోనాల్డ్ ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్
హైదరాబాదులోని ఆ రోడ్డుకి డోనాల్డ్ ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్
శింబు, ధృవ్​ రిజెక్ట్​ చేసిన కథను ఓకే చేసిన స్టార్​ హీరో!
శింబు, ధృవ్​ రిజెక్ట్​ చేసిన కథను ఓకే చేసిన స్టార్​ హీరో!
17 సిక్సర్లు, 5 ఫోర్లతో 160..ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు మామ
17 సిక్సర్లు, 5 ఫోర్లతో 160..ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు మామ
మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. 48గంటల్లోనే అకౌంట్‌లో రూ.8లక్షల
మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. 48గంటల్లోనే అకౌంట్‌లో రూ.8లక్షల