AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranya Rao: రన్యారావు స్మగ్లింగ్‌ హిస్టరీలో అంతుచిక్కని మిస్టరీ.. వెలుగులోకి సంచలన విషయాలు..

బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ హీరోయిన్ రన్య రావు గురించి కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఒకే ఏడాదిలో ఆమె 30 సార్లు దుబాయ్ కు వెళ్లినట్లు తెలిసింది. అంతేకాకుండా ఆమె ఒక్కో ట్రిప్ లో కిలోల కొద్దీ బంగారాన్ని భారత్ తీసుకువచ్చినట్లు సమాచారం. తాజాగా రన్యరావు విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.

Ranya Rao: రన్యారావు స్మగ్లింగ్‌ హిస్టరీలో అంతుచిక్కని మిస్టరీ.. వెలుగులోకి సంచలన విషయాలు..
Actor Ranya Rao
Rajitha Chanti
|

Updated on: Mar 08, 2025 | 9:55 AM

Share

దేశవ్యాప్తంగా కలకలం రేపిన బంగారం స్మగ్లింగ్‌ కేసులో నటి రన్యారావుకు చుక్కెదురయ్యింది. రన్యా రావును మూడు రోజుల పాటు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ కస్టడీకి అప్పగించింది న్యాయస్థానం. ఆమెను మూడు రోజుల పాటు విచారించబోతున్నారు DRI అధికారులు. లాస్ట్ ట్రిప్పులో 14.2 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్‌ చేస్తూ బెంగళూరు ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ హీరోయిన్‌ రన్యారావు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

రన్యారావ్‌ మొత్తం 27 సార్లు దుబాయ్‌కు వెళ్లారని వెల్లడించారు DRI అధికారులు. ప్రతిసారి ఒకే డ్రెస్‌తోనే దుబాయ్‌ వెళ్లారని, అందులోనే గోల్డ్‌ని స్మగ్లింగ్‌ చేశారని తెలిపారు. గత 15 రోజుల్లో 4 సార్లు, 2నెలల్లో పదిసార్లు దుబాయ్‌కి రన్యారావు వెళ్లొచ్చారు. ఒకో ట్రిప్పునకు రన్యారావుకు రూ. 10 నుంచి 50 లక్షల ఆదాయం వచ్చేదని అధికారులు వెల్లడించారు. ఈ కన్నడ హీరోయిన్‌..గోల్డ్‌ స్మగ్లింగ్‌ ద్వారా నెలకు కోటి నుంచి రూ. 3 కోట్ల ఆదాయం ఆర్జించేదని విచారణలో తేలింది. ఇక దుబాయ్‌తోపాటు, యూరప్‌, అమెరికాకు కూడా వెళ్లినట్లు విచారణలో రన్యా వెల్లడించారు.

కాళ్లకు, బెల్టులో గోల్డ్‌ బిస్కెట్లు దాచి ఆమె స్మగ్లింగ్‌ చేసేది. ఇక బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగాక, సాధారణ ప్రయాణికుల ఎగ్జిట్‌ నుంచి కాకుండా, తక్కువ చెకింగ్‌ ఉండే వీఐపీ ఎగ్జిట్‌ నుంచి రన్యారావు బయటపడేదని తెలుస్తోంది. అక్కడ ఓ కానిస్టేబుల్‌ ఆమెకు సహకరించేవాడని సమాచారం. ఎయిర్‌పోర్టులో రన్యా రావుకు సాయం చేసిన కానిస్టేబుల్‌ స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డ్ చేశారు. ఇక కస్టడీలో రన్యారావ్‌ నుంచి ఎలాంటి విషయాలను అధికారులు రాబడుతారనేది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్