SSMB29 నుంచి మరో మేజర్ అప్‌డేట్.. సంతోషంలో ఫ్యాన్స్
మహేష్ బాబు సినిమా గురించి రాజమౌళి ఎంత దాచిపెట్టాలని చూసినా.. ఏదో విధంగా అప్‌డేట్స్ బయటికి వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో మేజర్ అప్‌డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. రాబోయే మూడు వారాలు ఏం చేయబోతున్నారనే న్యూస్ అది. దాంతో ఖుషీ అవుతున్నారు ఫ్యాన్స్. మరి SSMB29 షూటింగ్ షెడ్యూల్ ఏంటి..?
Updated on: Mar 08, 2025 | 8:00 PM

మహేష్ బాబు ఫోకస్ అంతా ఇప్పుడు జక్కన్న సినిమాపైనే ఉంది. కనీసం బయటికి కూడా రావట్లేదాయన..! అంటే రాజమౌళి రానివ్వట్లేదనుకోండి..! షూటింగ్ మొదలై నెల రోజులవుతున్నా.. ఎక్కడ జరుగుతుంది.. ఏం షూట్ చేస్తున్నారనే చిన్న అప్‌డేట్ కూడా రాకుండా కేర్ తీసుకుంటున్నారు దర్శక ధీరుడు.

తాజాగా ఈ చిత్ర షూటింగ్‌పై మేజర్ అప్‌డేట్ వచ్చింది. షూటింగ్ మొదలైన రోజు నుంచి సిటీ దాటి బయటికి వెళ్లలేదు టీం. రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు కొన్ని సీన్స్ అల్యూమీనియం ఫ్యాక్టరీలోనూ చిత్రీకరించారు రాజమౌళి.

ఇప్పటి వరకు జరిగిన షెడ్యూల్స్‌లో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహాం కూడా పాల్గొన్నారు. తాజాగా ఫస్ట్ టైమ్ SSMB29 కోసం హైదరాబాద్ దాటారు యూనిట్. SSMB29 యూనిట్ అంతా ప్రస్తుతం ఒడిషాలో ఉన్నారు.

రాబోయే మూడు వారాల పాటు అక్కడే షూట్ జరగనుంది. అక్కడి డియోమాలి, తలమాలి, కాళ్యమాలి అటవీ ప్రాంతాల్లో 23 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేసారు రాజమౌళి. కోలాబ్ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఈ షెడ్యూల్ జరగనుంది. ఇప్పటికే రాజమౌళి ఒడిషా హోటల్‌లో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

SSBM29లో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం నటిస్తున్నారంటూ తెలుస్తుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు జక్కన్న. ఈ చిత్ర టాకీ ఏడాదిలోపే పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్‌కు ఎక్కువ టైమ్ తీసుకోవాలని చూస్తున్నారు జక్కన్న. అన్నీ కుదిర్తే 2027లో SSMB29 విడుదల కావడం ఖాయం.




