- Telugu News Photo Gallery Cinema photos Stars showering Alia Bhatt with compliments after her performance in Jigra movie
Alia Bhatt: ఆ విషయంలో ఆలియాను పొగడ్తలతో ముంచేస్తున్న స్టార్స్
సినిమా ఎలా ఉన్నా.. సక్సెస్ అని చెప్పుకునే రోజులు లేవిప్పుడు. సినిమా ఫలితాన్ని నటీనటులు ఓపెన్‌గానే చెప్పేస్తున్నారు. రిలీజ్ అయిన వెంటనే వాళ్లకి రిజల్ట్ తెలిసినా బిజినెస్ పరంగా ఏవో లావాదేవీలు ఉంటాయి కాబట్టి అప్పటికైతే సైలెంట్‌గా ఉంటున్నారు. కానీ తర్వాత్తర్వాత మాత్రం ఓపెన్ అయిపోతున్నారు...
Updated on: Mar 08, 2025 | 2:18 PM

జిగ్రాలో ఆలియా అద్భుతంగా నటించారు. తను ఆల్ఫా లేడీ అంటూ ఈ మధ్య ఆలియా భట్‌ని తెగ పొగిడేశారు సమంత. నటన పరంగా సమంత మాత్రమే కాదు.. చాలా మంది కాంప్లిమెంట్లు ఇచ్చేశారు ఆలియాకు.

కానీ, సినిమా రిజల్ట్ అనుకున్నట్టే వచ్చిందా అంటే నో.. దీని గురించి రీసెంట్‌గా మాట్లాడారు ఆలియా. జిగ్రా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు ఆలియా. దర్శకుడు వాసన్ బాలా ఎంతో కష్టపడి తీసినా, ఫలితం వేరేగా వచ్చింది.. అలాగని నిరాశపడిపోయి కూర్చోలేం కదా.. అన్నది ఆలియా చెబుతున్న మాట.

అంతే కాదు.. తనకు నటనంటే ఇష్టమని, సినిమా అంటే ప్రాణమని.. అందుకే జయాపజయాలకు అతీతంగా సినిమాలు నిర్మిస్తున్నాననీ అంటున్నారు ఆల్ఫా లేడీ. ప్రస్తుతం ఆల్ఫాలో నటిస్తున్నారు ఆలియా. జయాపజయాలు ఆమెను ఏమాత్రం ప్రభావితం చేయవట.

హిట్ వచ్చిందని ఖుషీ అవ్వడం, ఫ్లాప్ వచ్చిందని కుంగిపోవడం తనకు తెలియదంటారు ఈ లేడీ. ఓటమి ఎదురైనప్పుడు బాధ కచ్చితంగా ఉంటుందని, అయితే దాన్నుంచి చాలా త్వరగా బయటపడతాననీ, ఎవరైనా సరే దీన్ని ప్రాక్టీస్ చేయాలని సలహా ఇస్తున్నారు మిసెస్ రణ్‌బీర్ కపూర్

గతంతో పోలిస్తే ఇప్పుడు కాస్త స్పీడు తగ్గించారు ఆలియా. వేగంగా వెళ్లి ఫ్లాప్‌లు తెచ్చుకోవడం కన్నా, ఆచి తూచి అడుగులు వేసి మంచి సినిమాలు చేయాలని ఇలా ప్లాన్ చేసుకున్నారా? అనే టాక్ బాలీవుడ్‌లో బాగానే వినిపిస్తోంది. ఏదైనా.. హాలీవుడ్ రేంజ్‌లో ఇంప్లిమెంట్ చేస్తారు మేడమ్ అంటూ పొంగిపోతున్నారు ఫ్యాన్స్.




