- Telugu News Photo Gallery Cinema photos Tamannaah Intresting Comments About Love And Relationship Amid Rumours Of Breakup With Vijay Varma
Tamannah: కండీషన్స్ పెడితే అది ప్రేమ ఎలా అవుతుంది.. ? బ్రేకప్ రూమర్స్ మధ్య తమన్నా కామెంట్స్..
టాలీవుడ్ హీరోయిన్ తమన్నా పేరు గత కొన్నిరోజులుగా వార్తలలో నిలుస్తుంది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో దాదాపు రెండేళ్లుగా ప్రేమలో ఉంది మిల్కీబ్యూటీ. తమ ప్రేమ విషయాన్ని అధికారికంగానూ ఒప్పుకున్నారు. వీరిద్దరి పెళ్లి గురించి ఇప్పుడిప్పుడే నెట్టింట టాక్ నడుస్తుండగా.. అనుహ్యంగా బ్రేకప్ అంటూ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా.. ప్రేమ, రిలేషన్ షిప్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
Updated on: Mar 08, 2025 | 9:36 AM

మిల్కీబ్యూటీ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ఇద్దరు గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరు కలిసి ఎన్నోసార్లు బాలీవుడ్ పార్టీలలో సందడి చేశారు. త్వరలోనే వీరు పెళ్లి పీటలెక్కనున్నట్లు టాక్ నడిచింది.

ఈ క్రమంలో తాజాగా వీరిద్దరు విడిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతోనే బ్రేకప్ జరిగిందనే టాక్ నడుస్తుంది. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న తమన్నా.. ప్రేమ, రిలేషన్ షిప్ లపై తన అభిప్రాయాన్ని పంచుకుంది.

ప్రేమ రిలేషన్ షిప్ కు అర్థం తెలియక చాలామంది గందరగోళానికి గురవుతున్నారని.. ఇద్దరి మధ్య షరతులు స్టార్ట్ అయితే అది ప్రేమ కాదని తాను నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చింది. ప్రేమ ఎప్పుడూ నిస్వార్థమైనదని.. ఆ బంధంలో ఎలాంటి షరతులు ఉండవని తెలిపింది.

అది ఎప్పటికీ వన్ సైడ్ లవ్ లోనే ఉంటుందని.. ప్రేమ అనేది భావోద్వేగాలతో కూడుకున్నదని.. ఎదుటివ్యక్తి ఎలా ఉండాలి ? ఏం చేయాలనే విషయంలో నీకంటూ అంచనాలు ఏర్పడ్డాయంటే అది వ్యాపారలావాదేవితో సమానం.

నేను ఎవరినైనా ప్రేమిస్తే వారి భావాలకు స్వేచ్ఛను ఇవ్వాలి. వారిని వారిలా ఉండనివ్వాలనే విషయాన్ని గ్రహించాను.. రిలేషన్ లో ఉన్నప్పుడు కంటే లేనప్పుడే నేను ఆనందంగా ఉన్నాననిపిస్తుంది . భాగస్వామి ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చింది.




