AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 8.4 రేటింగ్

పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ పేపర్ లీకేజీలు, వాటి వెనక ఉన్న అంతర్గత శక్తులు, నిరుద్యోగులు ఎదుర్కొనే ఒత్తిడి వంటి అంశాలను ఈ వెబ్ సిరీస్ లో కళ్లకు కట్టినట్లు చూపించారు. గత వారమే ఓటీటీలోకి వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు దేశంలోనే టాప్ 3 ప్లేస్ లో ట్రెండింగ్ అవుతోంది. తెలుగులోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

OTT Movie: నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 8.4 రేటింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: May 19, 2026 | 7:14 PM

Share

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ (NEET UG) పశ్నాపత్రం లీక్ అయిన విషయం తెలిసిందే. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ పరీక్ష పేపర్ లీక్ కావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే కాదు గత కొన్నేళ్లలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ పేపర్ లీకేజీలు చాలా జరిగాయి. మరి అసలు ఈ పేపర్ లీకేజీల వెనక ఎవరున్నారు? అసలు వారి నెట్ వర్క్ ఎలా నడుస్తోంది? పరీక్షల పేపర్లు లీక్ అయితే వాటినే నమ్ముకున్న లక్షలాది మంది నిరుద్యోగుల పరిస్థితేంటి? సరిగ్గా ఇదే సమకాలీన అంశాలను కళ్లకు కడుతూనే తెరకెక్కించిన వెబ్ సిరీసే ఈ ‘ఎగ్జామ్’ (EXAM).. ది సిస్టమ్ ఎక్స్‌పోజ్‌డ్ అనేది ఈ సిరీస్ క్యాప్షన్. జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు ఎ. సర్గుణం పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో ఒకప్పటి హ్యాండ్సమ్ హీరో అబ్బాస్ విలన్ గా నటించడం విశేషం. ఆయనతో పాటు దుషార విజయన్, అదితి బాలన్, నరేన్ మణి తదితరులు కీలకపాత్రలు పోషించారు. గతంలో విక్రమ్ వేద మూవీతో సెన్సేషన్ క్రియేట్ క్రియేట్ చేసిన తమిళ దర్శక ద్వయం పుష్కర్ గాయత్రి ఈ సిరీస్ ను రూపొందించారు.

మే 15 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ‘ఎగ్జామ్’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం వంటి 5 భాషల్లో ఈ రియల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అందుబాటులో ఉంది. ఈ క్రమంలో ఓటీటీ రిలీజ్ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది ‘ఎగ్జామ్’ వెబ్ సిరీస్. దీనికి తోడు ప్రస్తుతం నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశమంతటా ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీంతో ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను తెగ చూసేస్తున్నారు ఆడియెన్స్. ఇవాళ (మే 19) అమెజాన్ ప్రైమ్ ఇండియన్ టాప్ 10 జాబితాలో 3వ స్థానంతో ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది ఎగ్జామ్: ది సిస్టమ్ ఎక్స్‌పోజ్‌డ్ వెబ్ సిరీస్. ఇక ఐఎమ్‌డీబీలోనూ ఈ సిరీస్ కు పదికి ఏకంగా 8.4 రేటింగ్ సొంతం రావడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే.. ప్రస్తుత పోటీ పరీక్షల ప్రపంచంలో జరిగే అక్రమాలు, పేపర్ లీకేజీలు, వ్యవస్థలోని లొసుగులను ఈ ఎగ్జామ్ వెబ్ సిరీస్ లో కళ్లకు కట్టినట్లు చూపించారు. అలాగే పేపర్ లీకేజీలతో నిరుద్యోగులు అనుభవించే మానసిక ఒత్తిడిని, నెట్‌వర్క్ మోసాలను ఇందులో చక్కగా చూపించారు.

అమెజాన్ ప్రైమ్ లో ఎగ్జామ్ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

ఎగ్జామ్ వెబ్ సిరీస్.. తెలుగు ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?
రూ.1000 లంచానికి లక్ష బహుమతి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
రూ.1000 లంచానికి లక్ష బహుమతి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
ఉప్మా అంటే ముఖం మాడ్చుకుంటున్నారా?కమ్మని పెరుగు ఉప్మా ట్రై చేయండి
ఉప్మా అంటే ముఖం మాడ్చుకుంటున్నారా?కమ్మని పెరుగు ఉప్మా ట్రై చేయండి
6 గంటల్లోనే విజయవాడ టు బెంగళూరు.. కొత్త హైవే త్వరలోనే..
6 గంటల్లోనే విజయవాడ టు బెంగళూరు.. కొత్త హైవే త్వరలోనే..
అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను..
అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను..
పెళ్లైన పురుషులు అస్సలు చేయకూడని నంబర్ వన్ తప్పు ఇదీ!
పెళ్లైన పురుషులు అస్సలు చేయకూడని నంబర్ వన్ తప్పు ఇదీ!
ఐపీఎల్ తోపులకు మొండిచేయి.. దేశవాళీ హీరోలకే జై కొట్టని గంభీర్
ఐపీఎల్ తోపులకు మొండిచేయి.. దేశవాళీ హీరోలకే జై కొట్టని గంభీర్