Viral: భర్త కనిపించట్లేదంటూ భార్య కంప్లయింట్.. అనుమానంతో పోలీసులు ఆమె కాల్ డేటా చెక్ చేయగా..

తన భర్త కనిపించట్లేదంటూ ఓ మహిళ పోలీస్ స్టేషన్‌‌లో కంప్లయింట్ ఇచ్చింది. ఆమె పేర్కొన్న ఫిర్యాదు మేరకు పోలీసులు..

Viral: భర్త కనిపించట్లేదంటూ భార్య కంప్లయింట్.. అనుమానంతో పోలీసులు ఆమె కాల్ డేటా చెక్ చేయగా..
Wife And Husband
Follow us

|

Updated on: Jul 05, 2022 | 9:00 AM

తన భర్త కనిపించట్లేదంటూ ఓ మహిళ పోలీస్ స్టేషన్‌‌లో కంప్లయింట్ ఇచ్చింది. ఆమె పేర్కొన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా సదరు మహిళను పలు ప్రశ్నలు అడిగారు. ఆమె ఎక్కడా కూడా పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీనితో పోలీసులకు అనుమానం వచ్చి.. ఆమె కాల్ డేటా చెక్ చేయగా.. ఆ కథేంటంటే..

వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని మిర్జాపూర్ గ్రామానికి చెందిన సావిత్రి అనే మహిళ గత నెల 28వ తేదీన భర్త బల్లూ కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన కంప్లయింట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇక వారికి ఆ తర్వాతి రోజు స్థానికంగా ఉన్న ఓ పొలంలో బల్లూ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి.. హత్యా.? లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే సావిత్రిని పలు ప్రశ్నలు అడిగారు. ఆమె ప్రతీసారి పొంతలేని సమాధానాలు చెప్పడం.. కేసును తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే సావిత్రి కాల్ డేటాను పరిశీలించగా.. ఆమె రక్వార్ అనే వ్యక్తికి తరుచూ ఫోన్ చేస్తున్నట్లు గుర్తించారు. దీనితో సావిత్రి, రక్వార్‌లను పోలీసులు విడివిడిగా తమదైన శైలికి విచారణ జరిపారు. దెబ్బకు రక్వార్ అసలు నిజాన్ని బయటపెట్టాడు.

ఇవి కూడా చదవండి

అసలేం జరిగిందంటే..

సావిత్రి, రక్వార్‌లు నాలుగేళ్ల నుంచి వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇద్దరూ కలిసి జీవించాలనుకున్నారు. దీనితో మద్యానికి బానిసైన భర్త బల్లూ తమకు ఎప్పటికైనా అడ్డంకిగా మారతాడని భావించిన ఆ ఇద్దరూ.. అతడ్ని హతమార్చేందుకు పక్కా స్కెచ్ వేశారు. జూన్ 28వ తేదీన బల్లూ.. తమ బంధువుల ఇంట్లో పెళ్లి కోసం వేరే ఊరు వెళ్లాడు. ఆ సమయంలోనే సావిత్రి, రక్వార్‌లు ఎవరికి అనుమానం రాకుండా తమ పని ముగించారు. రాత్రివేళ పెళ్లి నుంచి తిరిగి ఇంటికొస్తున్న బల్లూను మందు కొట్టేందుకు స్థానికంగా ఉండే ఓ పొలంలోకి తీసుకెళ్లాడు రక్వార్. అనంతరం రక్వార్ ఫుల్‌గా మందు కొట్టి నిద్రలోకి జారుకున్న బల్లూ గొంతు కోసి చంపేశాడు. కాగా, నిందితుల దగ్గర నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న పోలీసులు.. వారిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.