Hyderabad: అమ్మలేని లోకంలో తాను ఉండలేనని.. తనయుడి షాకింగ్ నిర్ణయం!
హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 27 ఏళ్ల ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి మరణాన్ని జీర్ణించుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు మద్యంకు బానిసయ్యాడు. చివరకు ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

హైదరాబాద్, మే 28: తల్లి మరణించి 2 నెలలు కూడా తిరక్కుండానే ఆ ఇంట మరో మరణం కలవరం రేపింది. తల్లి మరణం జీర్ణించుకోలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకరిని వీడి ఒకరు ఉండలేక వరుసగా తల్లీకుమారుడు మరణించారు. ఈ హృదయవిదారక ఘటన హైదరాబాద్‌లోని మార్కండేయ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..
హైదరాబాద్‌లోని మైలార్‌దేవపల్లి ప్రాంతంలోని నివాసం ఉంటున్న కొముర రెడ్డి ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడి తల్లి సుమారు రెండు నెలల క్రితం చనిపోంది. అప్పటి నుండి కొముర రెడ్డి మానసికంగా కుంగిపోయాడు. ఆ విషాదం తర్వాత అతను మద్యంకి బానిసయ్యాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఈ క్రమంలో బుధవారం (మే 27) తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో కొముర రెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న మైలార్‌దేవపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ జరుగుతోంది.
నోట్: ఏ సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదు. ధైర్యంగా పరిస్థితులతో పోరాడి గెలవడమే అసలైన గెలుపు. అయినా మనసు కుదుట పడకపోతే సమీపంలోని మానసిక నిపుణులను కలిసి మీ సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేయండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




