Viral: ప్రేయసితో లాడ్జికి వెళ్లాడు.. కాసేపటికే స్పృహ కోల్పోయాడు.. ఆస్పత్రికి తరలించగా మైండ్ బ్లాంక్!
ప్రేయసితో కలిసి లాడ్జికి వెళ్లిన ఓ యువకుడు.. కాసేపటికి స్పృహ కోల్పోయాడు. ఎంతసేపటికీ అతడు లేవకపోయేసరికి..
ప్రేయసితో కలిసి లాడ్జికి వెళ్లిన ఓ యువకుడు.. కాసేపటికి స్పృహ కోల్పోయాడు. ఎంతసేపటికీ అతడు లేవకపోయేసరికి.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సదరు యువకుడిని డాక్టర్లు పరీక్షించగా.. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడని నిర్ధారించారు. ఇక మృతుడి జేబులో శృంగార మాత్రలు పోలీసులకు లభించాయి. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అజయ్ అనే 25 ఏళ్ల యువకుడు తన ప్రేయసితో కలిసి ఆదివారం సాయంత్రం సావనేర్‌లో ఉన్న ఓ లాడ్జికి వెళ్లాడు. కొద్దిసేపు అంతా బాగానే ఉంది. అయితే హఠాత్తుగా అజయ్ స్పృహ తప్పి పడిపోయాడు. ఎంతసేపటికి లేవకపోయేసరికి భయపడిన అతడి ప్రియురాలు.. ఈ విషయాన్ని లాడ్జి సిబ్బందికి.. ఫోన్ ద్వారా అతడి స్నేహితుడికి తెలియజేసింది. వారంతా హుటాహుటిన అజయ్‌ని ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి.. అప్పటికే అజయ్ మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు మృతుడి జేబులో శృంగార సామర్ధ్యాన్ని పెంచే మాత్రలు పోలీసులకు లభ్యమయ్యాయి. ఇది హత్యా.? లేక ఇంకేదైనా ఉందా.? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.