Viral: పంచాయితీ గోడౌన్‌లో పని కోసం వచ్చిన ఇద్దరు మహిళలు.. కట్ చేస్తే.. తెల్లారేసరికి ఊహించని సీన్!
ఓ పంచాయితీ గోడౌన్‌లో ఇద్దరు మహిళలు పని చేసేందుకు వచ్చారు. ఆ గోడౌన్‌ను పర్యవేక్షిస్తున్న సూపర్‌వైజర్.. వారిని..
సాధారణంగా బంగారం, వెండి, వజ్రాలు, ఆభరణాలు, నగదు, విలువైన వస్తువులను దొంగలించడం మనం తరచూ వింటూనే ఉంటాం. అయితే ఇక్కడ ఇద్దరు మహిళలు ఎవరూ ఊహించని దాన్ని దొంగలించారు.
ఓ పంచాయితీ గోడౌన్‌లో ఇద్దరు మహిళలు పని చేసేందుకు వచ్చారు. ఆ గోడౌన్‌ను పర్యవేక్షిస్తున్న సూపర్‌వైజర్.. వారిని పనిలో పెట్టుకున్నాడు. అనంతరం అంతా సజావుగా జరిగింది. అయితే తెల్లారి సిబ్బంది పనిలోకి వచ్చే ముందు.. సదరు సూపర్‌వైజర్ స్టాక్ చెక్ చేసి చూడగా.. దెబ్బకు ఫ్యూజులౌట్.. ఇంతకీ అసలేం జరిగిందంటే.!
వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని కేశోడ్ తాలూకా పంచాయితీ గోడౌన్ నుంచి ఇద్దరు గుర్తుతెలియని మహిళలు సుమారు 800 కిలోల పత్తిని దొంగలించారు. పని కోసం వచ్చిన ఆ ఇద్దరు మహిళలు.. పేపర్ అప్లికేషన్ ఫారమ్‌లను తయారు చేయడంలో వినియోగించుకునేందుకు గోడౌన్‌లో భద్రపరిచిన 52 బస్తాల పత్తిలో 16 బస్తాలను దొంగిలించినట్లుగా తాలూకా అభివృద్ధి అధికారి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన కేశోడ్ పోలీసులు.. ఆ ఇద్దరు మహిళల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ప్రస్తుతం మార్కెట్‌లో పత్తి ధర రూ. 12 వేలు ఉంటుందని అంచనా. అటు కేజీ ధర కూడా రూ. 7 నుంచి రూ. 20కి చేరడంతో.. మహిళలు ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.