Viral Video: వారెవ్వా.. వాటే ఐడియా గురూ.. ‘పరిగెత్తే డైనింగ్ టేబుల్’.. నెట్టింట ట్రెండింగ్..
Viral Video: ఏమంటూ సోషల్ మీడియా (Social Media) అందుబాటులోకి వచ్చిందో ఎక్కడెక్కడో జరుగుతోన్న విషయాలు అరచేతిలో వాలిపోతున్నాయి. దేశ విదేశాలకు చెందిన వారు తమ ట్యాలెంట్‌ను...
Viral Video: ఏమంటూ సోషల్ మీడియా (Social Media) అందుబాటులోకి వచ్చిందో ఎక్కడెక్కడో జరుగుతోన్న విషయాలు అరచేతిలో వాలిపోతున్నాయి. దేశ విదేశాలకు చెందిన వారు తమ ట్యాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసుకుంటున్నారు. అంతకు ముందు తమ ప్రతిభకు తగిన గుర్తింపు లభించని వారికి కూడా సోషల్ మీడియా పుణ్యామాని ఎక్కడలేని పాపులారిటీ వచ్చేస్తోంది. సెలబ్రిటీలు సైతం తమ దృష్టికి వచ్చిన వీడియోలను షేర్ చేస్తూ.. సదరు ఔత్సాహికులకు మరింత పాపులారిటీని అందిస్తున్నారు.
ఇలా ప్రతిభను తట్టి లేపడంలో ఎప్పుడూ ముందుండే వారిలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర ఒకరు. తన దృష్టికి వచ్చిన విభిన్న అంశాలను వెంటనే ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడం ఆనంద్ మహీంద్రాకు ఒక అలవాటు. ఆనంద్ మహీంద్ర చేసే ట్వీట్స్‌తో ఎంతో మంది వినూత్న ట్యాలెంట్ ప్రపంచానికి పరిచయమైంది. ఇదిలా ఉంటే తాజాగా ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసిన ఓ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఓ నలుగురు స్నేహితులు డైనింగ్ టేబుల్ పై కూర్చొని రోడ్డుపై చక్కర్లు కొడుతున్న ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఓ వాహనాన్ని డైనింగ్ టేబుల్ మాదిరిగా డిజైన్ చేసిన సదరు కుర్రాళ్లు ఎంచక్కా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ చక్కర్లు కొడుతున్నారు. అలాగే పెట్రోల్ బంక్‌కు వెళ్లి బండిలో పెట్రోల్ కూడా కొట్టించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఈ వీడియోను పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్ర… ‘దీన్ని నేను ఈ-మొబిలిటీ అనుకుంటున్నాను. ఇక్కడ ‘ఈ’ అంటే ‘ఈటీ’ (తినడం) అని ఉద్దేశం’ అంటూ ఫన్నీ క్యాప్షన్ రాసుకొచ్చారు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘మహీంద్ర రెస్టారెంట్ ఆన్ వీల్స్‌ను ప్రమోట్ చేయాలి’ అని కామెంట్ చేశారు.
I guess this is e-mobility. Where ‘e’ stands for eat… pic.twitter.com/h0HKmeJ3AI
— anand mahindra (@anandmahindra) July 3, 2022
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..