AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khiladi Lady: వలపు వల విసిరి ముగ్గుర్ని ముగ్గులోకి దింపింది.. నిత్య పెళ్లికూతురి యవ్వారం తెలిసి భర్తలు షాక్..

హరి మరో వివాహం చేసుకునేందుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఈ క్రమంలో ఇంటి పని చేస్తున్న వ్యక్తి ద్వారా ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని పుత్తూరుకు చెందిన శరణ్య అనే యువతిని చూశాడు.

Khiladi Lady: వలపు వల విసిరి ముగ్గుర్ని ముగ్గులోకి దింపింది.. నిత్య పెళ్లికూతురి యవ్వారం తెలిసి భర్తలు షాక్..
Wedding
Shaik Madar Saheb
|

Updated on: Jul 04, 2022 | 4:06 PM

Share

Khiladi Lady: ఆమె అందంగా ఉంటుంది. ఆ అందం, అభినయంతో జీవితాన్ని ఎంజాయ్ చేద్దామని నిర్ణయించుకుంది. అలా ముగ్గురి దగ్గర మూడు పేర్లు చెప్పి వివాహం చేసుకుంది. చివరికి కిలాడీ లేడీ విషయం తెలిసి మోసపోయిన భర్తలు లబోదిబోమంటున్నారు. తమిళనాడు రాజధాని చైన్నైలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనంగా మారింది. చెన్నై ఆవడి సమీపంలోని ముత్తు పుదుపేట రాజీవ్‌నగర్‌కు చెందిన హరి (44) ఎంసీఏ పూర్తి చెన్నైలోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. హరికి 2008లో చెన్నైలోని కొలత్తూరు ప్రాంతానికి చెందిన ఓ యువతితో వివాహమైంది. మనస్పర్థల కారణంగా వీరు 2014లో విడాకులు తీసుకొని విడివిడిగా ఉంటున్నారు. దీంతో హరి మరో వివాహం చేసుకునేందుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఈ క్రమంలో ఇంటి పని చేస్తున్న వ్యక్తి ద్వారా ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని పుత్తూరుకు చెందిన శరణ్య అనే యువతిని చూశాడు. ఆ సమయంలో ఆమె తనకు 35 ఏళ్లు అని బంధువులు ఎవరూ లేరని చెప్పింది.

దీంతో హరి, శరణ్యను గతేడాది వివాహం చేసుకున్నాడు. పెళ్లి అనంతరం ఆస్తి వివరాలను చెప్పాలంటూ శరణ్య హరితో తరచూ గొడవపడేది. ఆస్తులను తనపై పేరు రాయలంటూ పేర్కొనది. చివరికి వరకట్న వేధింపులు గురి చేస్తున్నారంటూ భర్త, అత్త ఇంద్రాణిపై శరణ్య తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో హరి తల్లి ఇంద్రాణి.. కూడా ఆవడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా.. శరణ్య నిజమైన పేరు సుగణ అని తేలింది. శరణ్యకు 50 ఏళ్లని.. ఇదివరకే తిరుపతికి చెందిన రవి అనే వ్యక్తితో వివాహం జరిగిందని, ఇద్దరు కుమార్తెలున్నరని తెలిసింది. దీంతో ఆవడి పోలీసులు శరణ్యను అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు.

ఇదిలాఉంటే.. తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట సమీపంలోని వక్కనంపట్టి గ్రామానికి చెందిన సుబ్రమణి శనివారం ఆవడి పోలీసులకు ఓ ఫిర్యాదు చేశాడు. తాను సేలం, ఈరోడ్డు, కాట్పాడి వంటి రైల్వేస్టేషన్‌లోని క్యాంటిన్‌లో పని చేస్తున్నానని 2010లో ఆరణికి చెందిన ఏజెంట్‌ ద్వారా శరణ్యకు తనకు వివాహం జరిగినట్లు వివరించారు. తన వద్ద ఆమె పేరును సంధ్య అని చెప్పిందని.. గత పదేళ్లుగా శరణ్యతో తాను జీవించానని తమకు పిల్లలు లేరని పేర్కొన్నాడు. 2021 జూలైలో మేట్టుపాళ్యంలో రైల్వే క్యాంటీన్‌లో పనికి వెళ్లిన సమయంలో శరణ్య తనను వదిలి వెళ్లి పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శరణ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి