AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honor killing: నారాయణరెడ్డిది పరువు హత్యే.. మామే కడతేర్చాడు.. విచారణలో సంచలన విషయాలు..

మద్యం తాగించి, గొంతు నులిమి యువతి బంధువులే చంపేసినట్టు పోలీసులు గుర్తించారు. అనంతరం పెట్రోలు పోసి తగులబెట్టారు. మృతుడు నారాయణరెడ్డి, నిందితులు అంతా ఏపీకి చెందిన వారే.

Honor killing: నారాయణరెడ్డిది పరువు హత్యే.. మామే కడతేర్చాడు.. విచారణలో సంచలన విషయాలు..
Honor Killing
Shaik Madar Saheb
|

Updated on: Jul 04, 2022 | 3:49 PM

Share

Honor killing: తెలుగు రాష్ట్రాల్లో మరో పరువు హత్య వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలో గత నెల 27న అదృశ్యమైన ప్రైవేటు ఉద్యోగి నారాయణరెడ్డి జిన్నారం అటవీ ప్రాంతంలో సగానికి పైగా కాలిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. తనకు ఇష్టం లేకుండా యువకుడ్ని ప్రేమించి పెళ్ళి చేసుకుందన్న కక్షతో యువతి తండ్రి, బంధువులు కలిసి యువకుడిని దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. మద్యం తాగించి, గొంతు నులిమి యువతి బంధువులే చంపేసినట్టు పోలీసులు గుర్తించారు. అనంతరం పెట్రోలు పోసి తగులబెట్టారు. మృతుడు నారాయణరెడ్డి, నిందితులు అంతా ఏపీకి చెందిన వారే. ప్రకాశం జిల్లాలోని పొదలకొంటపల్లి, పొట్టిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నారాయణరెడ్డి పరువు హత్యకు గురయ్యాడన్న సమాచారంతో పొదలకుంట్లలోని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ప్రకాశంజిల్లా గిద్దలూరు మండలం పొదలకుంటపల్లి గ్రామానికి చెందిన రవళి రెడ్డి, కొమరోలు మండలం పొట్టిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన నారాయణ రెడ్డి, సమీప గ్రామానికి చెందిన రవళితో సంవత్సరం క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. నారాయణరెడ్డి, రవళి గ్రామాలు అతి సమీపంగా ఉండడంతో నాలుగు సంవత్సరాల క్రితమే వీరికి సాన్నిహిత్యం ఏర్పడింది. అనంతరం పెద్దలను ఎదిరించి ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. అయితే తన కూతుర్ని కిడ్నాప్‌ చేశాడంటూ మామ కేసు పెట్టడంతో పోలీసులు జోక్యం చేసుకుని యువతి రవళిని ఆమె తండ్రితో పంపించారు. తన కూతురికి మరో పెళ్ళి చేసేందుకు సిద్దమైన రవళి తండ్రి వెంకటేశ్వరరెడ్డి తన బంధువుల సాయంతో అల్లుడు నారాయణరెడ్డిని హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.

పెద్దల ఇష్టం లేకుండా పెళ్ళి చేసుకున్న ఏపీకి చెందిన యువకుడ్ని హైదరాబాద్‌లో యువతి తండ్రి, బంధువులు హత్య చేశారు. పరువు కోసమే ఈ హత్య చేసినట్టు గుర్తించారు. హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అదృశ్యమైన యువకుడు నారాయణరెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు అతనిపై పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. సగానికి పైగా కాలిన స్థితిలో ఉన్న శవాన్ని పోలీసులు ఆదివారం గుర్తించారు. ప్రేమ వివాహమే ఈ ఘోరానికి కారణంగా తెలుస్తోంది. మాట్లాడుకుందాం రమ్మంటూ యువకుడిని పిలిచిన యువతి బంధువు ఫుల్లుగా మద్యం తాగించి, మరొకరి సహకారంతో గొంతు నులిమి హత్య చేసి శివారు అటవీ ప్రాంతంలో పెట్రోల్‌ పోసి దహనం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మొత్తం నలుగురిపై కేసులు నమోదు చేశారు. కారు డ్రైవర్‌ ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిందితులను గుర్తించారు.

ఇవి కూడా చదవండి

గత నెల 27న రాత్రి 9 గంటల సమయంలో నారాయణరెడ్డి హైదరాబాద్‌లోని తన రూం నుంచి తాను శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తిని కలిసేందుకు వెళుతున్నట్లు చెప్పి బయటకు వెళ్లాడు. అనంతరం ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అయ్యింది. దీంతో అతని స్నేహితులు నారాయణరెడ్డి బావ వెంకటేశ్వరరెడ్డికి సమాచారం అందించారు. ఆయన గత నెల 30న కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదృశ్యం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు శ్రీనివాస్‌రెడ్డితో పాటు అతని గ్రామానికే చెందిన కారు డ్రైవర్‌ షేక్‌ ఆషిక్‌లను అదుపులోకి తీసుకోని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఏపీ వార్తల కోసం