CM Jagan: మహా అగ్నికణం అల్లూరి.. ఆయన త్యాగం చిరకాలం నిలిచిపోతుందన్న సీఎం జగన్
Alluri Sita Rama Raju Statue Inauguration: అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాల్లో భాగంగా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీతో కలిసి సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. భీమవరం వచ్చిన ప్రధాని మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు..
ఒక్క దేశంను మరో దేశం.. ఒక మనిషిని.. ఇంకొక మనిషి.. ఒక జాతిని మరొక జాతి.. దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని స్వాతంత్ర్య సమరయోధులు ఆకాంక్షించారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. దేశ స్వాతంత్ర్యం కోసం లక్షలాది మంది ప్రాణాలు అర్పించారన్నారు. మన జాతీయ ఉద్యమంలో 190 ఏళ్లు పరాయి పాలకులపై యుద్ధం చేశాం. ఇక్కడి మట్టి నుంచి అనేక అగ్ని కణాలు పుట్టుకొచ్చాయి. అల్లూరి ఒక మహా అగ్ని కణం.. ఆయన తెలుగు గడ్డపై ల్లూరి సీతారామరాజు పుట్టడం గర్వకారణమని సీఎం జగన్ అన్నారు. పరాయి పాలనపై మన దేశం యుద్ధం చేస్తూ అడుగులు ముందుకేసిందన్నారు.
అల్లూరి జయంతిని పురస్కరించుకుని వేడుకలు చేసుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. తెలుగుజాతి, భారతదేశానికి గొప్ప స్ఫూర్తి ప్రదాత అల్లూరి అని స్పష్టం చేశారు. ఆయన ఘనతను గుర్తుంచుకునే ఆయన పేరుపై జిల్లా ఏర్పాటు చేశారని వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగం ప్రతి మనిషి గుండెల్లో చిరకాలం నిలిచిపోతుందన్నారు సీఎం జగన్ అన్నారు.