AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: అల్లూరి స్ఫూర్తితో యువత దేశాభివృద్ధికి నడుంబిగించాలి: ప్రధాని నరేంద్రమోడీ

PM Modi Bhimavaram Visit: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాల్లో భాగంగా భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ (PM Narendra Modi) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్యం వీరుడి 30 అడుగులు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

PM Narendra Modi: అల్లూరి స్ఫూర్తితో యువత దేశాభివృద్ధికి నడుంబిగించాలి:  ప్రధాని నరేంద్రమోడీ
Pm Narendra Modi
Basha Shek
| Edited By: |

Updated on: Jul 04, 2022 | 3:13 PM

Share

PM Modi Bhimavaram Visit: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాల్లో భాగంగా భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ (PM Narendra Modi) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్యం వీరుడి 30 అడుగులు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వేదికపై అల్లూరి కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌, సీఎం జగన్‌, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, మంత్రి రోజా, మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి, మెగాస్టార్‌ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. అల్లూరి కాంస్య విగ్రహావిష్కరణ అనంతరం మాట్లాడిన మోడీ.. మన్యం వీరుడి స్ఫూర్తితో దేశాభివృద్ధికి యువత నడుంబిగించాలని పిలుపునిచ్చారు.

ఆదీవాసిల అభివృద్ధికి కృషి చేస్తాం.. భారత్‌ మాతాకీ జై అన్న నినాదంతో తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు మోడీ.. ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా మన్యం వీరుడి 125వ జయంత్యుత్సవాలు జరుపుకోవడం సంతోషం. తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి. ఆయన నడిచిన నేలలో నడవడం మనందరం చేసుకున్న అదృష్టం. భారతజాతి స్ఫూర్తి ప్రదాతగా అల్లూరి నిలిచారు. మన రాజ్యం మనదే అన్న నినాదంతో ఆయన ప్రజలను చైతన్యపరిచారు. అల్లూరి పిలుపుతోనే ఎంతో మంది యువకులు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది బలిదానాలు చేశారు. ఆంధ్ర రాష్ట్రం పుణ్యభూమి.. వీరభూమి. ఇక్కడకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అల్లూరి చేపట్టిన రంప ఆందోళన ప్రారంభించి నేటికి వందేళ్లు పూర్తయింది. అల్లూరి సీతారామరాజు కుటుంబసభ్యులతో వేదిక పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషిచేస్తోంది. ఇందులో భాగంగా అల్లూరి నడయాడిన అన్ని ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం. దేశంలోని యువత అల్లూరి స్ఫూర్తితో ముందుకెళ్లాలి. దేశాభివృద్ధికి నడుంబిగించాలి’ అని మోడీ పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్థిక వ్యవహారాల్లో వారికి అనుకూలత..
ఆర్థిక వ్యవహారాల్లో వారికి అనుకూలత..
నీట్‌ యూజీ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష ఎప్పుడంటే?
నీట్‌ యూజీ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష ఎప్పుడంటే?
నో-కాస్ట్ EMI వెనుక ఉన్న రహస్యం ఏమిటి? నిజంగా ఏ ఛార్జీలు ఉండవా?
నో-కాస్ట్ EMI వెనుక ఉన్న రహస్యం ఏమిటి? నిజంగా ఏ ఛార్జీలు ఉండవా?
టీమిండియా సంచలన నిర్ణయం..వరల్డ్ కప్ మధ్యలో ప్రాక్టీస్‎కు బ్రేక్
టీమిండియా సంచలన నిర్ణయం..వరల్డ్ కప్ మధ్యలో ప్రాక్టీస్‎కు బ్రేక్
తదుపరి మ్యాచ్‌కు ముందే రీఎంట్రీ ఇవ్వనున్న ఆల్ రౌండర్.. ఎవరంటే?
తదుపరి మ్యాచ్‌కు ముందే రీఎంట్రీ ఇవ్వనున్న ఆల్ రౌండర్.. ఎవరంటే?
వాట్సప్‌లోనే మీ-సేవ సేవలు.. ప్రభుత్వం అప్డేట్
వాట్సప్‌లోనే మీ-సేవ సేవలు.. ప్రభుత్వం అప్డేట్
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా