Viral video: వామ్మో.. భారీ పైథాన్‌ను ముద్దాడిన మహిళ… ఆ తర్వాత ఏం జరిగిందంటే
ఇంట్లో గోడమీద బల్లిని చూస్తేనే భయంతో పరుగులు పెడుతుంటారు కొందరు. ముఖ్యంగా ఆడవాళ్లు చిన్న బొద్దింకను చూసిన పారిపోతారు. అలాంటిది పాము కనిపిస్తే ఇంకేమైనా ఉందా.. పై ప్రాణము పనే పోతాయి.. వెనక్కి తిరగకుండా పరుగులు పెడతారు.
Viral video: ఇంట్లో గోడమీద బల్లిని చూస్తేనే భయంతో పరుగులు పెడుతుంటారు కొందరు. ముఖ్యంగా ఆడవాళ్లు చిన్న బొద్దింకను చూసిన పారిపోతారు. అలాంటిది పాము కనిపిస్తే ఇంకేమైనా ఉందా.. పై ప్రాణము పనే పోతాయి.. వెనక్కి తిరగకుండా పరుగులు పెడతారు. కానీ కొంతమంది మాత్రం ఏమాత్రం భయపడకుండా పాములను చేతులతో పట్టుకోవడం వాటితో ఆదుకోవడం లాంటివి చేస్తుంటారు. అయితే చిన్న పాములనే కాదు కొంతమంది ఏకంగా భారీ కొండచిలువలను, అనకొండలను కూడా అవలీలగా మచ్చిక చేసుకుంటుంటారు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే నిజంగా వెన్నులో వణుకు పుడుతోంది.
ఈ వీడియోలో ఓ మహిళ భారీ అనకొండకు స్నానం చేయిస్తూ కనిపిస్తోంది. ఆమె దాని శరీరాన్ని రుద్దుతూ శుభ్రం చేస్తూ ఉంటుంది. అయినా కూడా అది ఏమాత్రం కదలకుండా ఉండిపోతుంది. ఆ సమయంలో అది నిజమేనా.. లేక బొమ్మా అనే అనుమానం కలుగుతుంది. కానీ ఆ మహిళ భారీ అనకొండ తలను బయటకు తీసి ముద్దాడుతుంది. ఆమె ముద్దుపెడుతున్నపాటికి ఆ అనకొండ ఏమీ చేయకుండా ఉంటుంది నిజానికి అనకొండ ఒక్క దెబ్బతో ఆమె మింగేయగలదు. కానీ అది అలా చేయలేదు. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోకి ఇప్పటివరకు 48.8 k వ్యూస్, చాలా లైక్‌లు వచ్చాయి.
View this post on Instagram