AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: సాధారణ వాహన తనిఖీలు.. ఓ ట్రక్‌లో సీక్రెట్ అరలు.. ఏముందా అని చూడగా షాక్..

సాధారణ వాహన తనిఖీలు చేస్తోన్న పోలీసులు.. అటుగా వెళ్తోన్న ఓ ట్రక్‌ను ఆపారు. అనుమానమొచ్చి దాన్ని చెక్ చేస్తుండగా..

Viral: సాధారణ వాహన తనిఖీలు.. ఓ ట్రక్‌లో సీక్రెట్ అరలు.. ఏముందా అని చూడగా షాక్..
Lorry CheckingImage Credit source: Representative Image
Ravi Kiran
|

Updated on: Jul 05, 2022 | 9:30 AM

Share

సాధారణ వాహన తనిఖీలు చేస్తోన్న పోలీసులు.. అటుగా వెళ్తోన్న ఓ ట్రక్‌ను ఆపారు. అనుమానమొచ్చి దాన్ని చెక్ చేస్తుండగా.. వారికి ఆ ట్రక్‌లో సీక్రెట్ అరలు కనిపించాయి. అందులో ఏమున్నాయా అని చెక్ చేయగా పోలీసుల మైండ్ బ్లాంక్.. ఇంతకీ ఆ కథేంటంటే.!

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పోలీసులకు ఓ అంతర్రాష్ట్ర డ్రగ్స్ వ్యాపారి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. రోహానియా ప్రాంతంలోని మోహన్‌సరాయ్ బైపాస్ రోడ్డు సమీపంలో పోలీసులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సిబ్బందితో కలిసి సాధారణ వాహన తనిఖీలు నిర్వహించారు. ఆ రూట్‌లో పెద్ద ఎత్తున డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతోందని సమాచారం అందటం.. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో వారికి ఓ ట్రక్‌(HR 74A 6470)పై అనుమానం వచ్చింది. దాన్ని చెక్ చేస్తుండగా.. సీక్రెట్ అరలు కనిపించాయి. అందులో పోలీసులకు 1.45 క్వింటాళ్ల గంజాయి లభ్యమైంది. అది సుమారు రూ. 30 లక్షల విలువ ఉంటుందని అంచనా.

ఇవి కూడా చదవండి

కాగా, ట్రక్ డ్రైవర్ సులేమాన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు వారి స్టైల్‌లో విచారించగా.. డ్రగ్స్ వారణాసి మీదుగా రాజస్తాన్‌కు తరలిస్తున్నట్లు తేలింది. ఒడిశాలోని అంజన్ కుమార్ తకిరి అనే వ్యక్తి.. రాజస్తాన్‌లోని అల్వార్‌కు చెందిన సాహున్ ఖాన్‌కు ఈ డ్రగ్స్‌ను డెలివరీ చేయాలని సూచించినట్లుగా సులేమాన్ పోలీసులకు తెలిపాడు. అందులో తనకు రూ. 3 లక్షలు ఇస్తానని చెప్పినట్లుగా పేర్కొన్నాడు.

Follow Us