AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం దొరుతుందని కొండల్లో తవ్వకాలు.. అక్కడికెళ్లి చూసిన పోలీసులకు షాకింగ్ సీన్..!

ఏపీలోని సత్యసాయి జిల్లా పులిగుండ్లపల్లి గ్రామ శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో గుప్తనిధుల కోసం కొందరు రహస్యంగా తవ్వకాలు చేపట్టిన ఘటన కలకలం రేపింది. సమాచారం ప్రకారం, రెండు కార్లలో ఎనిమిది మంది వ్యక్తులు తవ్వకాలకు అవసరమైన పనిముట్లతో అక్కడికి చేరుకుని గుప్తనిధుల కోసం తవ్వకాలు ప్రారంభించారు. అడవి ప్రాంతంలో అనుమానాస్పద శబ్దాలు వినిపించడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

బంగారం దొరుతుందని కొండల్లో తవ్వకాలు.. అక్కడికెళ్లి చూసిన పోలీసులకు షాకింగ్ సీన్..!
Gold Hunt In Hills
Nalluri Naresh
| Edited By: |

Updated on: May 28, 2026 | 4:03 PM

Share

ఈజీగా మనీ సంపాదించడం కోసం.. ఏ పనీ చేయకుండా.. గుప్త నిధులు ఉంటాయనే మూఢనమ్మకంతో.. కొంత మంది తవ్వకాలు జరుపుకుంటారు. అయితే ఇప్పటివరకు గుప్త నిధులు తవ్వకాలు జరిపి బంగారం లేదా విలువైన వస్తువులు దొరికిన దాఖలా ఎక్కడా లేదు. అయినప్పటికీ, శ్రీ సత్య సాయి జిల్లా తలుపుల మండలం పులిగుండ్లపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో కూడా గుప్త నిధులు ఉంటాయని కొంతమంది తవ్వకాలు జరుపుతున్నారు. ఏకంగా రెండు కార్లలో.. తవ్వకాలు జరిపేందుకు ఉపయోగించే పనిముట్లను తీసుకొని ఎనిమిది మంది ముఠాగా అక్కడికి వచ్చారు. గుప్తనిధుల కోసం అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరపడం ప్రారంభించారు. అయితే అడవిలో శబ్దాలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. అటవీ ప్రాంతంలోని కొండల్లో తవ్వకాలు జరుపుతున్న గుప్త నిధుల ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్పాట్‌కి వెళ్ళిన పోలీసులకు మరో ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించిందట.. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపేందుకు ఈ ముఠా అక్కడ క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. ముఠాలో కొంతమంది స్థానికులతో పాటు మరి కొంతమంది కర్ణాటక ప్రాంతానికి చెందిన వారు కూడా ఉన్నారు. వీరంతా రెండు కార్లలో అటవీ ప్రాంతంలోకి వచ్చి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడ్డ నిందితుల వద్ద రెండు కార్లు, తవ్వకాలు జరిపేందుకు ఉపయోగించే పనిముట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈజీ మనీ కోసం వెంపర్లాడతే… ఇలాగే కటకటాల పాలవుతారు అంటున్నారు పోలీసులు.

Follow Us