AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీసులను చూసి పరుగో పరుగు.. పట్టుకుని విచారించగా బయటపడిన షాకింగ్ నిజం

వ్యాపారిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయాలని కొందరు చేసిన కుట్రను కామారెడ్డి జిల్లా పోలీసులు భగ్నం చేశారు. ఆరుగురిని అరెస్టు చేసి, వారి దగ్గర తుపాకీని స్వాధీనం చేసుకున్నట్టు  తెలిపారు. వ్యాపారవేత్తతో లావాదేవిలు జరిపిన వారే అతడి వద్ద తీసుకున్న అప్పును ఎగ్గోట్టడమే కాకుండా అతడిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసేందుకు స్కెచ్ వేసినట్లు గుర్తించారు.

పోలీసులను చూసి పరుగో పరుగు.. పట్టుకుని విచారించగా బయటపడిన షాకింగ్ నిజం
Kamareddy Police
Diwakar P
| Edited By: |

Updated on: May 28, 2026 | 7:53 PM

Share

కామారెడ్డి జిల్లాలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. పోలీసులను చూసిన వెంటనే.. కొందరు అనుమానిత వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారికి వెంబడించి పట్టుకోగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కామారెడ్డి జల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మీడియాకు వెల్లడించారు. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే స్టోరీ చదివేయండి..

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం క్రిష్ణాజీవాడ గ్రామంలో శివాలయం వద్ద ఈ నెల 27న కొందరు అనుమానిత వ్యక్తులు తాడ్వాయి పోలీసులకు తారసపడ్డారు. వారు పోలీసులను చూసి పరారీ అయ్యేందుకు యత్నించగా వెంబడించి పట్టుకున్నారు. పట్టబడిన వారిలో తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన నిట్టు నర్సింగరావు, సురం స్వామిలతో పాటు సంతాయి పేటకు చెందిన సూర స్వామీ అలియాస్ ఓడ్డే స్వామీ, పులి ప్రశాంత్ గౌడ్ లు ఉన్నారు. కామారెడ్డి కి చెందిన భూస శ్రీనివాస్ లో తాడ్వాయికి చెందిన ఈ నలుగురి మధ్య అర్థిక లావాదేవిలు జరిగాయి. ఈ విషయంలో నలుగురు కుడా భూస శ్రీనివాస్ కు నగదు బాకీ పడ్డారు. బాకీ ఎగ్గోట్టడంతో పాటు చాలా డబ్బులు ఉన్న భూస శ్రీనివాస్ ను కిడ్నాప్ చేయాలని నిర్ణయించారు. భూస శ్రీనివాస్ ను అపహరించడంతో పాటు బెదిరించాలంటే ఆయుధం కావాలని దాని కొనుగోలుకు ప్రయత్నం చేశారు.

నలుగురు కలిసి మహారాష్ట్రకు చెందిన అజయ్, వైభవ్ లను సంప్రదించారు. మహారాష్ట్రలోని నాయగావ్ కు చెందిన మారుతి గోకే ద్వారా తుపాకి కొనుగోలు చేయాలని భావించారు. అందులో భాగంగా నర్సింగరావు, ఓడ్డే స్వామీలు ఈ నెల 12న మహారాష్ట్రకు వెల్లి అజయ్, హన్మంతరావు గొంగపాలేను వైభవ్, ప్రకాష్ బరాడేవార్ సహకారంతో మారుతి గోకేను కలిసారు. రూ.30 వేలకు ఆయుదం కొనుగోలుకు ఒప్పందం చేసుకుని ముందుగా రూ.27,000 అడ్వాన్స్ గా ఇచ్చారు. మారుతి ఘేకో అందించిన తుపాకిని తాడ్వాయి మండలంలో క్రిష్ణాజీవాడి దగ్గర నలుగురికి మహారాష్ట్రలోని నాయగావ్ కు చెందిన వైభవ్ ప్రకాష్ బరాడేవర్, కోకులే గావ్ కు చెందిన అజయ్ హన్మంతరావు గోంగపాలేలు అందజేస్తుండగా పట్టుకున్నారు. పోలీసులు ఆరుగురిని విచారించడంతో వ్యాపారీ కిడ్నాప్ కుట్ర బట్ట భయలు అయింది. దాంతో ఆరుగురిని అరెస్టు చేసి వారివద్ద నుంచి ఒక నల్లరంగు పైర్ ఆర్మ్(తుపాకి), 5 రబ్బర్ బుల్లేట్ లు, ఎయిర్ రూపిల్ పెల్లెట్ బాక్సులు 2, 5 సెల్ ఫోన్ లు, ఒక బైక్. రెండు మంకీ క్యాపులు స్వాదీనం చేసుకున్నారు

అందులో నిట్టు నర్సింగరావు ఓ హత్యయత్నం కేసు లో నిందితుడిగా ఉన్నారు. పరారీలో ఉన్న ఆయుధం అమ్మిన మహారాష్ట్రకు చెందిన ఘోకే మారుతి కోసం ప్రత్యేక టీంలు గాలింపు చేపట్టాయి

Follow Us