AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇన్‌స్టా పరిచయం.. ప్రేమ పేరిట వేధింపులు.. ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో అసలేం జరిగిందంటే?

హైదరాబాద్‌లోని అత్తాపూర్ పోలీసులు లైంగిక వేధింపులు, స్టాకింగ్, బెదిరింపుల ఆరోపణల కేసులో ఐపీఎస్ ట్రైనీ అధికారి ఎం. ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన మహిళను ప్రేమ పేరుతో వేధించడం, నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించడం, వ్యక్తిగత చాట్‌లను బయటపెడతానని బెదిరించడం వంటి ఆరోపణలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జూలై 28న అతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు..

ఇన్‌స్టా పరిచయం.. ప్రేమ పేరిట వేధింపులు.. ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో అసలేం జరిగిందంటే?
IPS Trainee Uday Krishna Reddy
Srilakshmi C
|

Updated on: Jul 29, 2026 | 9:11 PM

Share

హైదరాబాద్, జూలై 29: లైంగిక వేధింపులు, స్టాకింగ్, బెదిరింపులు తదితర ఆరోపణల కేసులో ఐపీఎస్ ట్రైనీ అధికారి ఎం ఉదయ్ కృష్ణారెడ్డి (33)ను అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు సీపీ సజ్జనార్‌ మీడియాకు తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేసి, అనంతరం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి 2025 బ్యాచ్ ఐపీఎస్ ట్రైనీగా ఎంపికయ్యారు. ప్రస్తుతం శివరాంపల్లిలోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVP NPA)లో శిక్షణ పొందుతున్నారు.

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం ప్రేమగా మారి.. ఆపై..

2025 మధ్యకాలంలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాధితురాలితో పరిచయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. ఇద్దరూ ఐపీఎస్ ఎంపికకు సంబంధించిన అంశాలపై మాట్లాడుకుంటూ సన్నిహితులై, అనంతరం ప్రేమ సంబంధంలోకి వెళ్లినట్లు పేర్కొన్నారు. శిక్షణ సమయంలో ఇద్దరి మధ్య తరచూ విభేదాలు తలెత్తేవి. ఈ క్రమంలో నిందితుడు ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించడం, ఆయుధాలు ప్రదర్శించడం, దూషించడం, ఒకేసారి పలువురితో సంబంధాలు కొనసాగించాలని ఒత్తిడి చేయడం, బాధితురాలి ల్యాప్‌టాప్‌ను ధ్వంసం చేయడం, బ్లాక్ చేసిన తర్వాత నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించడం, వ్యక్తిగత చాట్‌లను బయటపెడతానని బెదిరించడం, ఆమె కుటుంబ సభ్యులు, సహచరులను అనుమతి లేకుండా సంప్రదించడం వంటి చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలు ఈ కారణాల వల్ల సంబంధాన్ని ముగించుకుని, అనంతరం మరొకరిని వివాహం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయినప్పటికీ నిందితుడు వేధింపులు కొనసాగించారు.

ఈ కేసులో విచారణ అనంతరం నిందితుడి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు జూలై 28 రాత్రి సుమారు 9:30 గంటలకు హైదరాబాద్‌లోని ఆరాంఘర్ ఎక్స్ రోడ్స్ సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉండగా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అనంతరం నిందితుడిని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు వెల్లడించారు. కేసుకు సంబంధించిన అన్ని అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని, చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Follow Us
ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో అసలేం జరిగిందంటే?
ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో అసలేం జరిగిందంటే?
Jabardasth: ఈ అక్కాచెల్లెళ్లు ఇప్పుడు బాగా ఫేమస్..గుర్తు పట్టారా?
Jabardasth: ఈ అక్కాచెల్లెళ్లు ఇప్పుడు బాగా ఫేమస్..గుర్తు పట్టారా?
బ్రాండ్ వ్యాల్యూలో తోపు టీంగా ఆర్‌సీబీ.. చెన్నై, ముంబైల పరిస్థితి
బ్రాండ్ వ్యాల్యూలో తోపు టీంగా ఆర్‌సీబీ.. చెన్నై, ముంబైల పరిస్థితి
తెలంగాణకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్
తెలంగాణకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్
మిషన్ మోడ్‌లో రైల్వేలో కొలువుల పండగ.. 5.56 లక్షల ఉద్యోగాలు భర్తీ
మిషన్ మోడ్‌లో రైల్వేలో కొలువుల పండగ.. 5.56 లక్షల ఉద్యోగాలు భర్తీ
జీవితాన్ని మలుపు తిప్పే రేఖ.. మీ అరచేతిలో ఉంటే లైఫ్ మారిపోవడమే
జీవితాన్ని మలుపు తిప్పే రేఖ.. మీ అరచేతిలో ఉంటే లైఫ్ మారిపోవడమే
ఇంటి ముందు గులాబీ చెట్టు ఉండొచ్చా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే
ఇంటి ముందు గులాబీ చెట్టు ఉండొచ్చా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే
చెడు దృష్టివలన నష్టపోయే రాశులివే.. మీ రాశి ఉందా?
చెడు దృష్టివలన నష్టపోయే రాశులివే.. మీ రాశి ఉందా?
NTR భరోసా పింఛన్ల తేదీ మారింది.. ఈ 6 జిల్లాల్లో రేపే అకౌంట్లలోకి
NTR భరోసా పింఛన్ల తేదీ మారింది.. ఈ 6 జిల్లాల్లో రేపే అకౌంట్లలోకి
వందే భారత్‌ రైలు నడపాలంటే ఏం చేయాలి? ఎలా జాబ్ కొట్టాలి..?
వందే భారత్‌ రైలు నడపాలంటే ఏం చేయాలి? ఎలా జాబ్ కొట్టాలి..?