దోపిడీ దొంగల ముఠా అరెస్ట్.. తమిళనాడు ముత్తూట్‌ దొంగలుగా గుర్తించిన సైబరాబాద్‌ పోలీసులు

తమిళనాడు లో ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడీ చేసిన దొంగల ముఠా సైబరాబాద్‌ పోలీసులకు చిక్కింది. నేషనల్ హైవే నుంచి మధ్యప్రదేశ్ కు పారిపోతుండగా..

దోపిడీ దొంగల ముఠా అరెస్ట్.. తమిళనాడు ముత్తూట్‌ దొంగలుగా గుర్తించిన సైబరాబాద్‌ పోలీసులు
Follow us

|

Updated on: Jan 23, 2021 | 4:55 PM

తమిళనాడు లో ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడీ చేసిన దొంగల ముఠా సైబరాబాద్‌ పోలీసులకు చిక్కింది. నేషనల్ హైవే నుంచి మధ్యప్రదేశ్ కు పారిపోతుండగా శంషాబాద్ తొండూపల్లి వద్ద దొంగలను ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముత్తూట్‌ ఫైనాన్స్‌లో దోపిడీకి పాల్పడ్డ దొంగలు తెలంగాణ వైపుకు వెళ్లే అవకాశం ఉండడంతో సైబరాబాద్ పోలీసుల సహకారం కోరారు తమిళనాడు పోలీసులు. దీంతో అలర్ట్‌ అయిన సైబరాబాద్ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు.

తమిళనాడులో దోపిడీ చేసిన అనంతరం బంగారం బ్యాగులను ఓ కంటైనర్ లో తరలిస్తూ దాని వెనకాలే దొంగలు ఫాలో అయ్యారు. తొండుపల్లి చెక్ పోస్ట్ వద్ద సిబ్బందిని అలర్ట్ చేయడంతో దోపిడీ ముఠా పట్టుబడింది. నిందితుల వద్ద నుండి 25 కిలోల బంగారు ఆభరణాలను, 7 తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 12 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

చోరోకి సంబంధించిన విషయాలను సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ మీడియాకు వెల్లడించారు. నిన్న కృష్ణగిరి జిల్లాలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో దోపిడీ జరిగింది. చాలా తక్కువ సమయంలో దోపిడీ ముఠాను అరెస్ట్‌ చేశాం. తొండపల్లి టోల్‌ప్లాజా దగ్గర నలుగురిని అదుపులోకి తీసుకున్నాం. కంటైనర్‌లో బంగారు అభరణాలు తీసుకొచ్చినట్లు చెప్పారు. మధ్య ప్రదేశ్‌కు చెందిన రూప్‌సింగ్‌ భాగాల్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించాం. మూడు నెలల క్రింతం లూథియానాలోని ముత్తూట్‌లో దోపిడీకి యత్నించారని సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ చెప్పారు.

దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.