AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6 నెలల్లో 22 కేజీలు తగ్గిన నటి.. ఇంజెక్షన్ల ద్వారా వెయిట్‌ లాస్‌ గురించి షాకింగ్ సీక్రెట్స్‌

ఆమె ఒక పాపులర్ స్టాండప్ కమెడియన్.. తన మాటలతో అందరినీ నవ్విస్తుంటుంది. అయితే గత ఆరు నెలలుగా ఆమె లుక్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. కేవలం ఆరు నెలల కాలంలోనే ఏకంగా 22 కిలోల బరువు తగ్గి పూర్తిగా స్లిమ్‌గా మారిపోయారు. సాధారణంగా సెలబ్రిటీలు ఇంత భారీగా బరువు తగ్గితే.. డైట్ చేశాను, జిమ్‌లో కష్టపడ్డాను అని చెబుతుంటారు.

6 నెలల్లో 22 కేజీలు తగ్గిన నటి..  ఇంజెక్షన్ల ద్వారా వెయిట్‌ లాస్‌ గురించి షాకింగ్ సీక్రెట్స్‌
Bollywood Star And Comedian
Nikhil
|

Updated on: Feb 13, 2026 | 6:15 AM

Share

ఈమె మాత్రం అందుకు భిన్నంగా అందరినీ ఆశ్చర్యపరిచే నిజాన్ని వెల్లడించింది. తాను బరువు తగ్గడానికి కేవలం వ్యాయామం మాత్రమే కారణం కాదని, ఒక రకమైన మెడికల్ ఇంజెక్షన్లు వాడానని బాహాటంగా చెప్పేసింది. ఈ నిజాయితీ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ ఆమె ధైర్యాన్ని అభినందించారు. ఇంతకీ ఆ మ్యాజిక్ ఇంజెక్షన్ ఏంటి? ఐశ్వర్య మోహన్‌రాజ్ బరువు తగ్గిన తీరు.. దాని వెనుక ఉన్న మెడికల్ రిస్క్ ఇప్పుడు నెట్టింట వైరల్​గా మారింది.

ఐశ్వర్య మోహన్‌రాజ్ ఇటీవల తన యూట్యూబ్ వీడియోలో తన వెయిట్ లాస్ ప్రయాణాన్ని వివరించారు. తాను బరువు తగ్గడానికి ‘మౌంజారో’ అనే మెడికేషన్ ఉపయోగించానని ఆమె స్పష్టం చేశారు. చాలామంది తమ పద్ధతులను రహస్యంగా ఉంచుతారని, కానీ తాను మాత్రం నిజాన్ని చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. అయితే ఈ చికిత్సను ఆమె సొంతంగా తీసుకోలేదు.. సరైన వైద్య పర్యవేక్షణలో మాత్రమే దీనిని ఉపయోగించినట్లు క్లారిటీ ఇచ్చారు.

Bollywood Actress Soha Ali Khan

Bollywood Actress Soha Ali Khan

సోహా అలీ ఖాన్ మద్దతు..

ఐశ్వర్య నిజాయితీని నటి సోహా అలీ ఖాన్ మనస్ఫూర్తిగా అభినందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేస్తూ.. “చివరికి ఎవరో ఒకరు నిజాన్ని చెప్పారు. కేవలం సరైన ఆహారం లేదా వర్కవుట్ల వల్ల మాత్రమే కాకుండా మౌంజారో వంటి మెడిసిన్స్ వల్ల బరువు తగ్గామని నిజం చెప్పడానికి చాలా ధైర్యం కావాలి” అని సోహా పేర్కొన్నారు. ఇలాంటి విషయాల్లో సెలబ్రిటీలు నిజాయితీగా ఉండటం వల్ల సామాన్యులు తప్పుదోవ పట్టకుండా ఉంటారని ఆమె అభిప్రాయపడ్డారు.

View this post on Instagram

A post shared by Soha (@sakpataudi)

సోహా అలీ ఖాన్ ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు. ఇన్ఫ్లుయెన్సర్ల మాటలు విని వైద్య సలహాలు తీసుకోవద్దని, ఏదైనా ట్రీట్‌మెంట్ తీసుకునే ముందు డాక్టర్లను సంప్రదించాలని ఆమె కోరారు. “ఒజెంపిక్, మౌంజారో అనేవి బరువు తగ్గే ట్రెండ్స్ కావు. అవి చాలా సీరియస్ మెడికల్ ట్రీట్‌మెంట్స్. ఇవి కేవలం కొంతమందికి మాత్రమే ఉద్దేశించినవి” అని సోహా గుర్తు చేశారు. కేవలం విల్ పవర్ వల్ల మాత్రమే బరువు తగ్గడం సాధ్యం కాదని, హార్మోన్లు, ఇన్సులిన్ నిరోధకత, పీసీఓఎస్ (PCOS), థైరాయిడ్ సమస్యలు, జీవక్రియ వంటి అనేక అంశాలు దీనిపై ప్రభావం చూపుతాయని ఆమె వివరించారు.

వెయిట్ లాస్ ఇంజెక్షన్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని సోహా హెచ్చరించారు. “ఈ ఇంజెక్షన్లు సహాయపడవచ్చు కానీ ఇవి చాలా సీరియస్. వీటికి మెడికల్ టెస్టులు, డాక్టర్ పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండాలి. ఎవరెవరు వాడుతున్నారు అని అడగడం కంటే.. అసలు ఇవి ఎవరికి అవసరం? అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి” అని ఆమె సూచించారు. ఐశ్వర్య మోహన్‌రాజ్ కూడా ఈ పాయింట్‌నే హైలైట్ చేశారు. ఆమె వారానికి ఒక కిలో, నెలకు 4 కిలోల చొప్పున ఆరు నెలల్లో 22 కిలోలు తగ్గారు. కానీ దీని వెనుక వైద్యుల కృషి ఎంతో ఉందని ఆమె తెలిపారు. సెలబ్రిటీలు తమ బరువు తగ్గే విధానంపై ఇలాంటి నిజాయితీ గల సమాచారాన్ని పంచుకోవడం వల్ల సమాజంలో ఒక మంచి మార్పు వస్తుంది. కేవలం అందం కోసం కాకుండా, ఆరోగ్యం కోసం వైద్యుల సలహాతో నిర్ణయాలు తీసుకోవడం ఎంతో ముఖ్యం.