AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో జర్రుంటే నిండు ప్రాణం పోయేది.. ఆపద్బాంధవుడైన టీసీ.. వీడియో

ముంబై లోకల్ రైళ్ల రద్దీ మధ్య, కుర్లా రైల్వే స్టేషన్‌లో ఓ వృద్ధ ప్రయాణికుడు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కదులుతున్నలోకల్ ట్రైన్ నుంచి జారి పట్టాలపై పడబోయాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న రైల్వే టికెట్ చెకర్ ఒకరు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. కిందపడబోతున్న వృద్ధుడిని టీసీ వేగంగా వెనక్కి లాగడంతో అతను సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు.

Viral Video: వామ్మో జర్రుంటే నిండు ప్రాణం పోయేది.. ఆపద్బాంధవుడైన టీసీ.. వీడియో
Tc Save Elder Man In Railway Station
Balaraju Goud
|

Updated on: Feb 12, 2026 | 12:05 PM

Share

ముంబై లోకల్ రైళ్ల రద్దీ మధ్య, కుర్లా రైల్వే స్టేషన్‌లో ఓ వృద్ధ ప్రయాణికుడు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కదులుతున్నలోకల్ ట్రైన్ నుంచి జారి పట్టాలపై పడబోయాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న రైల్వే టికెట్ చెకర్ ఒకరు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. కిందపడబోతున్న వృద్ధుడిని టీసీ వేగంగా వెనక్కి లాగడంతో అతను సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు రైల్వే స్టేషన్ లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ ఫుటేజీని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. రైలు కదులుతుండగా ఎక్కడం కానీ, దిగడం కానీ చేయొద్దంటూ ప్రయాణికులకు రైల్వే శాఖ హెచ్చరించింది.

థానే-CSMT లోకల్ రైలు నుండి దిగుతుండగా, ఒక వృద్ధ ప్రయాణికుడు అకస్మాత్తుగా బ్యాలెన్స్ కోల్పోయి ప్లాట్‌ఫారమ్ – రైలు మధ్య జారిపడబోయాడు. స్టేషన్‌లో ఉన్న టికెట్ చెకర్ (TC) వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణీకుడి ప్రాణాలను కాపాడాడు. ఆ వృద్ధ ప్రయాణీకుడు కదులుతున్న రైలు నుంచి దిగడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని వయస్సు, జనసమూహం కారణంగా, అతను జారిపడి రైలుకు చాలా దగ్గరగా పడిపోయాడు. సమీపంలో ఉన్న TC పరిస్థితిని పసిగట్టి వేగంగా పరిగెత్తాడు. TC తన శక్తినంతా ఉపయోగించి వృద్ధ ప్రయాణీకుడిని సురక్షితంగా ప్లాట్‌ఫారమ్‌పైకి లాగుకొచ్చాడు . ఈ దృశ్యాలు CCTV ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. సమీపంలోని వ్యక్తులు స్పందించేలోపు, పెద్ద విషాదం తప్పింది. వృద్ధ ప్రయాణీకుడికి వెంటనే చికిత్స అందించారు.

ఈ సంఘటన వీడియో కనిపించిన వెంటనే, సోషల్ మీడియాలో స్పందనలు వెల్లువెత్తాయి. వినియోగదారులు TC ధైర్యాన్ని, సమయస్పూర్తిని ప్రశంసిస్తున్నారు. రద్దీగా ఉండే ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణికులకు ఇటువంటి రైల్వే ఉద్యోగులే నిజమైన భద్రతా వలయం అని చాలా మంది అన్నారు. ఈ సంఘటన తర్వాత, రైల్వే అధికారులు, ప్రయాణికులు TC ని అభినందనలతో ముంచెత్తారు. ప్రయాణీకుల భద్రత కోసం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండటానికి ఉద్యోగులకు శిక్షణ అవసంరం. ఈ సంఘటన ఆ శిక్షణ, మానవత్వానికి ఒక చక్కటి ఉదాహరణ అని అధికారులు చెబుతున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…