ఇదేం రోగం.. అప్పుడు కాబోయే అల్లుడితో పారిపోయిన అత్త.. ఇప్పుడు సోదరుడి వరసయ్యే వ్యక్తితో పరార్..!
కొందరు వావి వరసల మరిచి, మదమెక్కి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటిదే మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. గత సంవత్సరం తన కూతురికి కాబోయే అల్లుడిని వివాహం చేసుకోవడానికి తన ఇంటిని విడిచిపెట్టిన అనితా దేవి (అప్నా దేవి) మరోసారి అందరినీ షాక్‌కు గురిచేసింది.

కొందరు వావి వరసల మరిచి, మదమెక్కి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటిదే మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. గత సంవత్సరం తన కూతురికి కాబోయే అల్లుడిని వివాహం చేసుకోవడానికి తన ఇంటిని విడిచిపెట్టిన అనితా దేవి (అప్నా దేవి) మరోసారి అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈసారి, ఆమె తన కూతురికి కాబోయే భర్త రాహుల్‌ను వదిలి, తన మాజీ భర్త బావమరిదితో కలిసి వెళ్లిపోయింది. ఇద్దరూ పారిపోయారు. అనితా దేవి రాహుల్‌తో దాదాపు 10 నెలలు నివసించింది.
అనితా దేవి, రాహుల్ బీహార్‌లోని సీతామర్హి జిల్లాలోని ఉస్రైనా గ్రామంలో కలిసి నివసిస్తున్నారు. ఈ సమయంలో, అనితా దేవి తన మాజీ భర్త జితేంద్ర కుమార్ బావమరిదిని కలిసింది. అతను బట్టల వ్యాపారం నడుపుతున్నాడు. వారి మధ్య సంభాషణలు పెరిగాయి, ప్రేమ వ్యవహారం చిగురించింది. దీని తరువాత, అనితా దేవి రాహుల్‌ను విడిచిపెట్టి తన భర్త బావమరిదితో కలిసి వెళ్లింది. అనిత రూ.2 లక్షల నగదు, నగలు తీసుకుని ఇంటి నుంచి పరారైందని కుటుంబసభ్యులు తెలిపారు.
అనితా దేవి తమ ఇంటి నుండి రూ. 2 లక్షల నగదు, విలువైన నగలు తీసుకెళ్లిందని రాహుల్ ఆరోపించాడు. రాహుల్ అలీఘర్‌కు వెళ్లి దాడోన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కానీ ఈ సంఘటన బీహార్‌లో జరిగిందని పేర్కొంటూ పోలీసులు కేసును కొట్టివేశారు. ఈ మొత్తం విషయం ఇప్పటికే సంచలనం సృష్టించింది.
అలీఘర్‌లోని నాగల మచారియా గ్రామానికి చెందిన జితేంద్ర కుమార్ తన కుమార్తె శివాని వివాహం రాహుల్‌తో నిశ్చయించారు. వివాహం ఏప్రిల్ 16, 2025న జరగాల్సి ఉంది. వివాహ సన్నాహాలు పూర్తయ్యాయి. వెడ్డింగ్ కార్డులు పంపిణీ చేశారు. అయితే, వివాహానికి కేవలం తొమ్మిది రోజుల ముందు, శివాని తల్లి అనితా దేవి తన కాబోయే అల్లుడు రాహుల్‌తో పారిపోయింది. బీహార్‌లోని సీతామర్హి జిల్లాలోని ఉస్రైనా గ్రామంలో కాపురం పెట్టారు. ఈ సంఘటన ఆ ప్రాంతమంతా చర్చనీయాంశంగా మారింది.
ఇక, పోలీసులు తరువాత వారిద్దరినీ అరెస్టు చేశారు. కానీ అనితా దేవి రాహుల్‌తో వెళ్లాలని నిర్ణయించుకుంది. పోలీసులు ఆమెను అతనితో పంపారు. అనేక పంచాయితీలు జరిగాయి, కానీ ఇద్దరూ విడిపోవడానికి నిరాకరించారు. ఇప్పుడు, 10 నెలల తర్వాత, కథ కొత్త మలుపు తిరిగింది. అనితా దేవి తన భర్త బావమరిదితో పారిపోవడం మరోసారి సంచలనంగా మారింది. ఈ ఘటన సంబంధాలు, నమ్మకం, సామాజిక విలువల గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఈ మొత్తం సంఘటనతో రాహుల్ మానసికంగా కలత చెందాడు. మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
