Fire Accident: షాద్‌నగర్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. కంపెనీలో భారీ పేలుడు

ఈ మధ్య కాలంలో పలు కంపెనీల్లో పేలుడు సంభవించి భారీ ఎత్తున అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా షాద్‌నగర్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా శ్రీనాథ్‌ రోటో ప్యాక్‌ కంపెనీలో పేలుడు..

Fire Accident: షాద్‌నగర్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. కంపెనీలో భారీ పేలుడు
Fire Accident
Follow us
Subhash Goud

|

Updated on: Jul 16, 2023 | 10:38 PM

ఈ మధ్య కాలంలో పలు కంపెనీల్లో పేలుడు సంభవించి భారీ ఎత్తున అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా షాద్‌నగర్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా శ్రీనాథ్‌ రోటో ప్యాక్‌ కంపెనీలో పేలుడు చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున పేలుడు సంభవించడంతో మంటలు భారీగా చెలరేగాయి. ప్రమాదంలో 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు.

అలాగే మరి కొందరిని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉన్నవారిని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. బూర్గుల శివారులో ఉన్న కంపెనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే కంపెనీలో సిలిండర్ పేలుడు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి