ప్రేమించాడనీ.. విద్యార్థిపై పెట్రోలు పోసి నిప్పంటించిన యువతి తండ్రి!

తమ కుమార్తెను ప్రేమించాడనే నెపంతో 18 ఏళ్ల విద్యార్థిపై యువతి తండ్రి, బంధువులు పెట్రోల్‌ పోసి సజీవ దహనానికి పాల్పడ్డారు. తీవ్రగాయాలపాలైన విద్యార్ధి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ ఆదివారం ఉదయం కన్ను..

ప్రేమించాడనీ.. విద్యార్థిపై పెట్రోలు పోసి నిప్పంటించిన యువతి తండ్రి!
Shashank
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 17, 2023 | 7:15 AM

బెంగళూరు, జులై 17: తమ కుమార్తెను ప్రేమించాడనే నెపంతో 18 ఏళ్ల విద్యార్థిపై యువతి తండ్రి, బంధువులు పెట్రోల్‌ పోసి సజీవ దహనానికి పాల్పడ్డారు. తీవ్రగాయాలపాలైన విద్యార్ధి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ ఆదివారం ఉదయం కన్నుమూశాడు. తమ కూతురితో ప్రేమాయణం సాగించడమే ఈ దాడికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగళూరులో చోటుచేసుకున్న ఈ షాకింగ్‌ ఘటన స్థానికంగా చర్చణీయాంశంగా మారింది. వివరాల్లోకెళ్తే..

బెంగళూరులోని రాజరాజేశ్వరినగర్‌కు చెందిన ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. శశాంర్‌ను శనివారం ఉదయం 8 గంటలకు అతని తండ్రి రంగనాథ్ కాలేజీ వద్ద దింపివెళ్లాడు. ఐతే ఆ రోజు క్లాస్‌లేవీ లేకపోవడంతో ఇంటికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్న శశాంక్‌ ఉదయం 9.30 గంటల ప్రాంతంలో రాజరాజేశ్వరి మెడికల్ కాలేజీ సమీపంలో బెంగళూరు-మైసూరు రహదారి వైపు నడుచుకుంటూ వెళుతుండగా.. టయోటా ఇన్నోవాలో వచ్చిన దుండగుల ముఠా శశాంక్‌ను వాహనంలో అపహరించి తీసుకెళ్లారు. వాహనంలో తాను ప్రేమించిన యువతి తండ్రితో సహా మొత్తం ఏడుగురు ఉన్నట్లు పోలీసులకు తెలిపాడు.

అతని కళ్లకు గంతలు కట్టి, తన కూతురినే ప్రేమిస్తావా అంటూ మామ దాడికి పాల్పడ్డాడని తెలిపాడు. ఆ తర్వాత దుండగులు శశాంక్‌ను సమీపంలోని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించి వెళ్లారు. శరీరమంతా మంటలు అనంతరం మంటలను ఆర్పడానికి నేలపై దొర్లానని, మట్టి కూడా చల్లుకున్నానని బాధితుడు తెలిపాడు. అనంతరం తన మొబైల్ నుంచి బంధువు హీరాకి కాల్ చేయగా.. ఆమె నా స్నేహితులు సరస్వతి, కుమార్‌తో వచ్చి తనను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులకు తెలిపాడు. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సహానా పాటిల్‌ అండ్‌ టీమ్‌ అతని స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి, యువతి తండ్రితో పాటు మరో ఆరుగురిపై కిడ్నాప్, దాడి, హత్యాయత్నం కేసులను నమోదు చేశారు. ప్రస్తుతం శశాంక్‌ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!