AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomatoes: టమాటాలు అమ్మి నెలరోజుల్లోనే కోటీశ్వరులైన రైతులెవరో తెలుసా ?

వ్యాపారాలు చేసి, లాటరీలు గెలుచుకొని కోట్లు సంపాదించేవాళ్లను చూసుంటారు. కానీ టమాటాలు అమ్మి ఇద్దరు రైతులు కోటీశ్వరులు కావడం అందర్ని ఆశ్యర్యానికి గురిచేస్తోంది. వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం టమాటా దేశవ్యాప్తంగా మండిపోతున్నాయి.

Tomatoes: టమాటాలు అమ్మి నెలరోజుల్లోనే కోటీశ్వరులైన రైతులెవరో తెలుసా ?
Tomato
Aravind B
|

Updated on: Jul 17, 2023 | 7:26 AM

Share

వ్యాపారాలు చేసి, లాటరీలు గెలుచుకొని కోట్లు సంపాదించేవాళ్లను చూసుంటారు. కానీ టమాటాలు అమ్మి ఇద్దరు రైతులు కోటీశ్వరులు కావడం అందర్ని ఆశ్యర్యానికి గురిచేస్తోంది. వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం టమాటా దేశవ్యాప్తంగా మండిపోతున్నాయి. టమాటాలు కొనాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కిలో టమాటా ధర రూ.300లకు చేరి రికార్డు సృష్టించింది. మరికొన్ని ప్రాంతాల్లో రూ. 200 నుంచి 300 వరకు ధరలు పలుకుతున్నాయి. ఈ సమయామే ఆ రైతులను కోటీశ్వరులుగా మార్చాయి. మహారాష్ట్రలోని పుణె జిల్లాలో తుకారం భాగోజి గాయకర్ అనే వ్యక్తి 12 ఎకరాల్లో టమాటా పంట సాగు చేశారు.

ఆయనకు ఈ పంటపై సరైన అవగాహన ఉండటంతో బాగా దిగుబడి వచ్చింది. ప్రస్తుతం టమాటా రేట్లు మార్కెట్లో అత్యధిక ధరలకు అమ్ముడుపోతున్న విషయం తెలిసిందే. దీంతో తుకారం తాను పండించిన టమాటాలు అమ్మి నెలరోజుల్లోనే కోటిన్నరకు పైగా సంపాదించుకున్నారు. ఒక్కో పెట్టెను రూ.2100 చొప్పున నారాయణ్‌గంజ్ అనే మార్కెట్‌లో విక్రయించారు. మరో విషయం ఏంటంటే శుక్రవారం ఒక్కరోజే దాదాపు 900 పెట్టెలు అమ్మి రూ.18 లక్షలు సంపాదించారు. ఇదిలా ఉండగా చత్తీస్‌గఢ్‌లోని ధమ్‌తరీ జిల్లా బీరన్ గ్రామానికి చెందిన అరుణ్ సాహూ అనే వ్యక్తి 150 ఎకరాల్లో టమాటా సాగు చేసారు. రోజుకు 600 నుంచి 700 వరకు పెట్టెలు అమ్మారు. దీంతో నెలరోజుల్లోనే కోటికి పైగా సంపాదించారు.

ఇవి కూడా చదవండి