Sonia Gandhi: రాహుల్ వరినాట్లు వేసిన మహిళలకు సోనియా స్వగృహంలో విందు.. మహిళతో డ్యాన్స్..

గత వారం రాహుల్ గాంధీ ఢిల్లీ నుండి హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు రోడ్డు మార్గంలో వెళ్తూ  సోనిపట్‌లోని బరోజా, మదీనా గ్రామాల దగ్గర పొలాల్లో కొందరు మహిళలు, పురుషులు వరి నాట్లు వేయడాన్ని రాహుల్ చూశారు. రాహుల్ తన కాన్వాయ్‌ను ఆపి రైతులతో కలిసి పొలాల్లో వరి నాట్లు వేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ట్రాక్టర్ కూడా నడిపారు. అనంతరం రాహుల్ గాంధీ మహిళలతో మమేకమై వారితో ఫొటోలు దిగారు.

Sonia Gandhi: రాహుల్ వరినాట్లు వేసిన మహిళలకు సోనియా స్వగృహంలో విందు.. మహిళతో డ్యాన్స్..
Sonia Gandhi
Follow us
Surya Kala

|

Updated on: Jul 16, 2023 | 9:28 PM

యూపీఏ అధినేత్రి సోనియా గాంధీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సోనియా గాంధీ కొందరి మహిళలతో కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం  కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో కలిసి పొలాల్లో వరి నాట్లు వేసిన మహిళలతో కలిసి తల్లి సోనియా తమ నివాసంలో  డ్యాన్స్ చేశారు. ఈ వీడియో 10 జనపథ్‌లోని సోనియా గాంధీ నివాసానికి సంబంధించినది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ మహిళలకు ఆతిథ్యం ఇచ్చారు. వారితో కలిసి భోజనం చేశారు.

సోనియా గాంధీ ఇంటి వద్ద భారీ సంఖ్యలో మహిళలు, పిల్లలు ఉన్నారు. సోనియా గాంధీ రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీతో మాట్లాడుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. సోనియా గాంధీ కూడా ఈ మహిళలతో కలిసి భోజనం చేస్తున్నారు. ఆ వీడియోలో మహిళలు ప్రియాంక గాంధీని కౌగిలించుకోవడం కనిపించింది. అదే సమయంలో, ఆమె లాలించడం కూడా కనిపించింది. వీడియోలో, సోనియా గాంధీ కూడా హర్యాన్వీ పాటల ట్యూన్‌లో మహిళలతో కలిసి డ్యాన్స్ చేశారు.

సోనేపట్‌లో రాహుల్ గాంధీ వరి వేశాడు

గత వారం రాహుల్ గాంధీ ఢిల్లీ నుండి హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు రోడ్డు మార్గంలో వెళ్తూ  సోనిపట్‌లోని బరోజా, మదీనా గ్రామాల దగ్గర పొలాల్లో కొందరు మహిళలు, పురుషులు వరి నాట్లు వేయడాన్ని రాహుల్ చూశారు. రాహుల్ తన కాన్వాయ్‌ను ఆపి రైతులతో కలిసి పొలాల్లో వరి నాట్లు వేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ట్రాక్టర్ కూడా నడిపారు. అనంతరం రాహుల్ గాంధీ మహిళలతో మమేకమై వారితో ఫొటోలు దిగారు.

రైతులే భారతదేశానికి బలం 🇮🇳🚜

ఈ మహిళ రైతులను సోనియా గాంధీ ఆహ్వానించారు. ఢిల్లీలోని తమ 10, జన్‌పథ్‌కు భోజనానికి ఆహ్వానించారు. సోనియా గాంధీ తన నివాసంలో ఆ మహిళలతో కలిసి కూర్చుని భోజనం చేశారు. సోనిపట్ నుండి ఈ మహిళలను తీసుకురావడానికి రాహుల్ గాంధీ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.  మహిళలందరినీ తీసుకురావడానికి రాహుల్ పెద్ద బస్సుని పంపారు. 10 జనపథ్‌లతో పాటు, ఈ మహిళలు ఇండియా గేట్‌ దగ్గర సందడి చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..