West Godavari District: పశ్చిమ గోదావరి జిల్లా విద్యార్థి హత్య కేసులో ఊహించని కోణం.. స్వలింగ సంపర్కమే కారణం
పశ్చిమగోదావరి జిల్లాలో ఓ యువకుడి కిడ్నాప్, ఆపై హత్య తీవ్ర కలకలం రేపింది. ఈ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో ఓ యువకుడి కిడ్నాప్, ఆపై హత్య తీవ్ర కలకలం రేపింది. ఈ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నల్లజర్ల మండలం పోతవరం గ్రామానికి చెందిన కొనకళ్ల వంశీ కలకత్తాలో నిట్‌లో చదువుతున్నాడు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇంటి వద్దే ఉంటున్నాడు. మంగళవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో వంశీ తన స్నేహితుల వద్ద కు వెళ్లివస్తానని ఇంటి నుంచి వెళ్లాడు. రెండు గంటల తర్వాత వంశీ తండ్రి శ్రీనుకి ఓ ఫోన్ కాల్ వచ్చింది. నీ కొడుకును కిడ్నాప్ చేశామని, వెంటనే 50 లక్షల రూపాయల ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేను అంత ఇవ్వలేనని వంశీ తండ్రి బదులిచ్చాడు. తన కుమారుని విడిచిపెట్టమని ప్రాధేయపడ్డాడు. కనీసం 25 లక్షలైనా ఇవ్వాలని శ్రీనుని డిమాండ్ చేశారు కిడ్నాపర్లు. తాను అంత ఇచ్చుకోలేనని శ్రీను చెప్పాడు. దీంతో ఎంత ఉంటే అంత పట్టుకుని… నల్లజర్ల ఊరి చివరకు రావాలని సూచించారు. డబ్బులు ఇచ్చి కొడుకుని విడిపించుకోవాలని శ్రీనుతో చెప్పారు. దీంతో శ్రీను తన దగ్గరున్న సుమారు లక్ష రూపాయలు తీసుకుని నల్లజర్ల ఊరి చివర తెల్లారే ఎదురు చూశాడు. కిడ్నాపర్లు రాకపోవడంతో ఇంటికి వెళ్లిపోయాడు. ఇంతలోనే ఓ చెడువార్త వినాల్సి వచ్చింది.
షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో వంశీ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అయితే పోలీసుల దర్యాప్తులో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. వంశీ హత్యకు స్వలింగ సంపర్కమే కారణమని పోలీసులు తేల్చారు. ఉంగుటూరు మండలం బాదంపూడికి చెందిన చింతన సత్యనారాయణే వంశీని చంపినట్టు ఒప్పుకున్నాడు. తనను వెయిట్ చేయించాడని, అడిగిన డబ్బులు ఇవ్వలేదనే కోపంతో వంశీని చంపినట్టు సత్యనారాయణ పోలీసులకు చెప్పాడు.
Also Read: ‘అందరూ బాగుండాలనే స్వార్థం’.. యూవీ నువ్వు ఎప్పటికీ గ్రేటే..!