Yuvraj Singh: ‘అందరూ బాగుండాలనే స్వార్థం’.. యూవీ నువ్వు ఎప్పటికీ గ్రేటే..!

కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో ఆస్పత్రిలో బెడ్ దక్కించుకునేందుకు ఓ యుద్దమే చేయల్సి వచ్చింది. కేవలం కుర్చీలలో...

Yuvraj Singh: 'అందరూ బాగుండాలనే స్వార్థం'.. యూవీ నువ్వు ఎప్పటికీ గ్రేటే..!
Yuvraj Singh
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 29, 2021 | 8:07 AM

కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో ఆస్పత్రిలో బెడ్ దక్కించుకునేందుకు ఓ యుద్దమే చేయల్సి వచ్చింది. కేవలం కుర్చీలలో కూర్చోబెట్టి, నేలపై పడుకోబెట్టి చికిత్స చేసిన సందర్భాలు కూడా మనం చూశాం. ఈ అవస్థలను దగ్గరగా చూసిన భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్.. బెడ్ల కొరత తీర్చేందుకు తన వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. తాజాగా, తన ఫౌండేషన్‌ ద్వారా తెలంగాణలోని నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో 120 ఐసీయూ బెడ్స్‌కు సాయం అందించాడు. ఈ ఐసీయూ బెడ్లను యువీ వర్చువల్‌గా ప్రారంభించాడు. గతంలో కూడా చాలాసార్లు తన మంచి మనసు చాటుకున్నాడు యూవీ. ఈ ఏడాది మే నెలలో తన ఫౌండేషన్‌ పేరిట మధ్యప్రదేశలోని ఇండోర్‌లో మూడున్న కోట్ల వ్యయంతో 100 పడకల ఆసుపత్రిని నిర్మించి ఇచ్చాడు.

కరోనా మహమ్మారి చాలామంది జీవితాల్లో చీకట్లు నింపిందని యువరాజ్‌సింగ్‌ విచారం వ్యక్తం చేశారు. ఎంతోమంది ఆసుపత్రుల్లో బెడ్లు లేక ఇబ్బందులు పడ్డారన్న యువీ, ప్రతీ కుటుంబంలో ఒక్కరైనా ఈ మహమ్మారి బారిన పడ్డారని చెప్పారు. వెంటిలెటర్స్‌ బెడ్స్‌ దొరక్క ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని వ్యాఖ్యానించారు. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో పేద ప్రజలకు ఇబ్బందులు కలగకుండా YouWeCan ఫౌండేషన్ మిషన్ ద్వారా బెడ్స్ సరఫరా చేస్తున్నట్టు వెల్లడించారు. తమ ఫౌండేషన్ కార్యక్రమాలకు అండగా నిలుస్తున్న ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. నిజామాబాద్ ఆసుపత్రిలో మెరుగైన సేవలకు ఈ ఐసీయూ బెడ్స్ ఉపయోగపడాలని ఆశించారు యువరాజ్‌ సింగ్. ఇంత టెక్నాలజీ ఉన్నా, అంతమంది ప్రాణాలు పోవడం, చాలామంది చావు అంచుల వరకు వెళ్లిరావడం బాధాకరమని అన్నారు యువీ. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ప్రతీ ఒక్కరు తమకు తోచిన విధంగా కరోనా బాధితులకు సాయం చేయాలని కోరాడు యువరాజ్ సింగ్.

Also Read: ‘సీతాకోకచిలక’ హీరో కార్తీక్‌కు తీవ్ర గాయాలు.. వ్యాయామం చేస్తున్న సమయంలో

‘థియేటర్లను బ్రతికించండి’.. గొంతెత్తుతున్న తెలుగు నటులు..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!