నీచుడా ఎంత తెగించావ్‌రా.. పెళ్లికి నో చెప్పిందని అమ్మాయి కళ్లలో ఉప్పు పోసి..
యువకుడి ప్రేమ ప్రాణం తీసింది. పెళ్లికి నో చెప్పిందని యువతిని దారుణంగా చంపేశాడు. కళ్లలో ఉప్పు పోసి, గొంతు కోసి హత్య చేశాడు. ఆమె కదలికలను ట్రాక్ చేయడానికి వాట్సాప్ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని కొన్ని గంటల్లోనే అరెస్టు చేశారు.

కొంతమంది యువకులు దారుణంగా వ్యవహరిస్తున్నారు. యువతి తనను ప్రేమించకపోయినా, పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినా ప్రాణాలు తీయడానికి వెనకాడడం లేదు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రేమ వ్యవహారం ప్రాణం తీసింది. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినందుకు యువతిని ఆమె ప్రియుడు అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు గంటల్లోనే అరెస్టు చేశారు. ఈ ఘటన బెంగళూరులోని శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
యామిని ప్రియ అనే 20ఏళ్ల యువతి కాలేజీ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా.. మంత్రి మాల్ వెనుక ఉన్న రైల్వే పట్టాల సమీపంలో విఘ్నేష్ అనే యువకుడు ఆమెను అడ్డగించాడు. అనంతరం విఘ్నేష్ దారుణంగా ఆమె కళ్లలో ఉప్పు పోసి, ఆపై ఆమె గొంతు కోసి హత్య చేశాడు. సమాచారం అందిన వెంటనే శ్రీరాంపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కొన్ని గంటల్లోనే నిందితుడు విఘ్నేష్‌ను అరెస్టు చేశారు. హత్యలో నిందితుడికి సహకరించిన అతని సహచరుల కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.
పెళ్లికి నో చెప్పిందని..
పోలీసుల దర్యాప్తులో హత్యకు గల కారణాలను నిందితుడు వెల్లడించాడు. యామిని తనను వివాహం చేసుకోవడానికి నిరాకరించిందనే కోపంతో చంపేసినట్లు విఘ్నేష్ ఒప్పుకున్నాడు. నిందితుడు యామిని గురించి సమాచారం సేకరించడానికి మిషన్ యామిని ప్రియపేరుతో ఒక వాట్సాప్ గ్రూప్‌ను సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ గ్రూప్‌లో నిందితుడితో సహా నలుగురు సభ్యులు ఉన్నారు. ఈ గ్రూపు ద్వారానే యామిని కదలికలు, ఆమె ఎవరితో మాట్లాడుతుందనే సమాచారాన్ని సేకరించి హత్యకు పథకం రచించాడు. విఘ్నేష్ చాలా కాలంగా యామినిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తానని బెదిరించాడు. అయితే పెళ్లికి నిరాకరించడంతో విఘ్నేష్ ఈ దారుణమైన చర్యకు పాల్పడ్డాడు.
మరిన్ని క్రైమ్ వార్తాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




