Hyderabad: మరో దారుణం.. అర్ధరాత్రి కత్తులతో పొడిచి యువకుడి హత్య!
హైదరాబాద్ మహా నగరంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో పారామౌంట్ కాలనీలో ఇర్ఫాన్ (24) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. బిలాల్ అనే వ్యక్తి ఇర్ఫాన్ ని కత్తితో పొడిచి హత్య చేశాడు. హంతకుడు బిలాల్ భార్యకి మృతుడు ఇర్ఫాన్ అన్న అద్నాన్ కి మధ్య..

హైదరాబాద్, డిసెంబర్ 15: హైదరాబాద్ మహా నగరంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో పారామౌంట్ కాలనీలో ఇర్ఫాన్ (24) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. బిలాల్ అనే వ్యక్తి ఇర్ఫాన్ ని కత్తితో పొడిచి హత్య చేశాడు. హంతకుడు బిలాల్ భార్యకి మృతుడు ఇర్ఫాన్ అన్న అద్నాన్ కి మధ్య అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తుంది. బిలాల్, అద్నాన్ మధ్య గొడవ జరుగుతుందన్న సమాచారంతో అక్కడికి ఇర్ఫాన్ వచ్చాడు. ఈ ఘర్షణలో మాట మాట పెరిగి ఇర్ఫాన్ పై బిలాల్ కత్తితో దాడి చేశాయి. ఇర్ఫాన్ ని హాస్పిటల్ కి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.
హంతకుడు బిలాల్ ని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. హంతకుడు బిలాల్ భార్యకి, మృతుడి తమ్ముడు అదన్‌కి అఫైర్ నడుస్తోంది. బిలాల్ అద్నాన్ ని పిలిచి మాట్లాడుతుండగా గొడవ మొదలైంది. దీంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. అద్నాన్ పై దాడి జరుగుతుండగా సమాచారం అందుకున్న ఇర్ఫాన్.. సంఘటన స్థలానికి చేరుకున్న బిలాల్ ఇర్ఫాన్ పై దాడి చేశాడు. ఈ దాడుల్లో ఇర్ఫాన్ చనిపోగా అద్నాన్ తీవ్రగాయాల పాలయ్యాడు. దీంతో తప్పు ఒకరు చేస్తే చావు మరొక్కరికి అయినట్లైంది. సౌత్ వెస్ట్ జోన్‌లోని టోలీచౌకీ పోలీస్ స్టేషన్ పరిధిలో పారామౌంట్ కాలనీ గేట్ నెంబర్ 4, మర్వ డెంటల్ హాస్పిటల్ వద్ద ఆదివారం రాత్రి ఈ హత్య జరిగింది.
నిజానికి, ఇర్ఫాన్ తన తమ్ముడు అద్నాన్, హంతకుడు బిలాల్ మధ్య గొడవ జరుగుతుందని తెలిసి గొడవని ఆపటానికి వచ్చాడు. గొడవ ఆపే నేపధ్యం లో బిలాల్ ఇర్ఫాన్ పై కత్తితో దాడి చేయటంతో.. కత్తి ఇర్ఫాన్ ఛాతిలో దిగింది. ఇర్ఫాన్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా.. దారిలోనే మృతి చెందాడు. ఆలివ్ హాస్పిటల్ వైద్యులు ఇర్ఫాన్‌ను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న టోలీచౌకీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బిలాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి గొడవకి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.








