AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఓర్నాయనో.. చిట్టీలు కడుతున్నారా..? ఈ విషయం తెలిస్తే గుండె గుభేల్..

చిట్టీల పేరుతో రూ.15 కోట్లు వసూలు చేసి దంపతులు పరారైన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. చిట్టీల కాలం అయిపోయినా డబ్బులు ఇవ్వకపోవడంతో నిజాంపేట్‌లోని బండారి లేఔట్‌లో ఉన్న రేష్మ క్లినిక్ దగ్గరికి వెళ్లిన బాధితులు.. రేష్మ, అలీ దంపతులు పరారైనట్లు గుర్తించారు. 42 మంది బాధితులు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Hyderabad: ఓర్నాయనో.. చిట్టీలు కడుతున్నారా..? ఈ విషయం తెలిస్తే గుండె గుభేల్..
Chit Fund Scam
Shaik Madar Saheb
|

Updated on: Oct 18, 2025 | 10:12 AM

Share

వైద్య వృత్తిలో కొనసాగుతున్నారుగా.. అని ఎవ్వరికి అనుమానం రాలేదు.. వాళ్ల దగ్గరకు వచ్చే పేషెంట్స్, చుట్టుపక్కల వారికి చిట్టీలు వేస్తున్నామని పరిచయమయ్యారు.. అధిక వడ్డీ వస్తుందని, ఒకేసారి చిట్టిల డబ్బులు తీసుకోవచ్చంటూ అందరినీ.. నమ్మించారు.. ఇలా లక్షలు వసూలు చేసి.. కొట్లు పోగేశారు. ఆ తర్వాత కిలాడీ లేడి జంట ఒక్కసారిగా అక్కడి నుంచి జంప్ అయ్యారు. ఈ విషయం తెలుసుకుని బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. వైద్య వృత్తిలో కొనసాగుతున్న ఓ జంట చిట్టీల పేరుతో భారీ మోసానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ నగరంలోని నిజాంపేట్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రేష్మ, అలీ అనే దంపతులు.. నిజాంపేట బండారీ లేఅవుట్‌లో ‘రేష్మ క్లినిక్’’ పేరుతో వైద్యులుగా చలామణి అవుతున్నారు.. అయితే.. చిట్టీల పేరుతో 100 మందికి పైగా వ్యక్తుల నుంచి దాదాపుగా రూ.15 కోట్ల మేర వసూలు చేశారు.. ఒక్కొక్కరి నుంచి 50, 10 లక్షలు వసూలు చేశారు. అయితే.. ఇటీవల చిట్టీల కాలం పూర్తయినప్పటికీ, డబ్బులు ఇవ్వడం లేదు.. దీంతో బాధితులు రోజూ వారి దగ్గరకు వెళ్లి ప్రశ్నిస్తున్నారు..

ఈ క్రమంలోనే.. అనుమానంతో బాధితులు క్లినిక్ వెళ్లి చూడగా.. దంపతులు అప్పటికే అదృశ్యమయ్యారు. దీంతో మోసపోయామని గ్రహించిన 42 మంది బాధితులు బాచుపల్లి పోలీసులను ఆశ్రయించారు. రేష్మ, అలీ దాదాపుగా.. బాధితుల నుంచి సుమారుగా రూ.15 కోట్లు వసూలు చేసినట్లు విచారణలో తేలిందని.. అధిక లాభాల పేరుతో ప్రజలను మోసం చేశారని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. పోలీసులు రేష్మ-అలీ దంపతుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. కాగా.. పెద్దమొత్తంలో ఆర్ధిక లావాదేవీలు జరగడంతో ఈ కేసును EOWకు బదిలీ చేయనున్న బాచుపల్లి పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!
4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!