AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్.. నడిబొడ్డున “వై” ఆకారంలో డిజైన్.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్. నగరంలో భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి ముందడుగు పడింది. హెచ్‌ఎండీఏ ఈ ప్రాజెక్ట్ నిర్మించనుంది. ఇప్పటికే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. త్వరలోనే ప్రభుత్వానికి డీపీఆర్ అందనుంది. డీపీఆర్‌కు ఆమోదం తర్వాత టెండర్లను ఆహ్వానించనున్నారు.

Hyderabad: హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్.. నడిబొడ్డున వై ఆకారంలో డిజైన్.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
Hyderabad Flyover
Venkatrao Lella
|

Updated on: Aug 06, 2026 | 7:11 PM

Share

హైదరాబాద్ ప్రజలకు భారీ శుభవార్త. నగరం నడిబొడ్డులో మరో భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక ఫ్లైఓవర్లను నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా నాంపల్లి-లక్డీకాపూర్ మార్గంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు “వై” ఆకారంలో భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఇప్పటికే డీపీఆర్ తయారీ పూర్తవ్వగా.. త్వరలోనే పరిపాలనా అనుమతులు రానున్నాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(HMDA) ఈ ప్రాజెక్టును రూపొందిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఫ్లైఓవర్ రూట్ మ్యాప్ ఇదే..

ఈ ‘వై’ ఆకారం ఫ్లైఓవర్ సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ వద్ద నుంచి ప్రారంభం అవుతుంది. అక్కడ నుంచి పబ్లిక్ గార్డెన్, అసెంబ్లీ వెనుక వైపు, రైల్వే ట్రాక్ మీదుగా లక్డీకాపూర్ వరకు విస్తరించి ఉంటుంది. లక్డీకాపూర్ వద్ద రెండు భాగాలుగా విడిపోతుంది. ఇందులో ఒక భాగం మాసబ్ ట్యాంక్ వైపు ఉన్న ఫ్లైఓవర్‌కు లింక్ అవుతుంది. ఇక మరో భాగం ఖైరతాబాద్ వైపు రోడ్డుతో కలుస్తుంది. మొత్తం 1.45 కిలోమీటర్లు మేర ఈ ఫ్లైఓవర్ ఉంటుంది. మూడు లైన్లుగా ఉండనుండగా.. వన్ వ్‌ రూట్‌గా దీనిని నిర్మించనున్నారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో నాంపల్లి, లక్డీకాపూర్, ఖైరతాబాద్ వైపు ట్రాఫిక్ తగ్గనుంది. నాంపల్లి నుంచి వచ్చే వాహనాలు నేరుగా ఈ ఫ్లైఓవర్ మీదుగా ఖైరతాబాద్, మసబ్ ట్యాంక్ వైపు వెళ్లవచ్చు. దీని వల్ల సిగ్నల్ ఫ్రీ జర్నీ లభించనుంది.

తగ్గనున్న ట్రాఫిక్..

నాంపల్లి-లక్డీకాపూర్ మధ్య మూడు సిగ్నల్స్ ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల సమయంలో ట్రాఫిక్ ఆంక్షల వల్ల మరింతగా ఇబ్బంది పడుతున్నారు. ఈ కొత్త ఫ్లైఓవర్ వల్ల అలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కోసం టోపోగ్రఫీ సర్వే నిర్వహిస్తున్నారు. ఓ కన్సల్టెన్సీ సంస్థకు ఈ బాధ్యతలు అప్పగించారు. త్వరలోనే డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తర్వాత ఫ్లైఓవర్ పనులు ప్రారంభం కానున్నాయి. ప్రారంభం కాగానే వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టనున్నారు. దీని వల్ల వాహనదారులకు ఇబ్బందులు తగ్గుతాయి. ప్రస్తుతం నాంపల్లి-లక్డీకాపూర్ మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీని వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుది. ఈ సమస్యను తగ్గించేందుకు హెచ్‌ఎండీఏ ఈ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేసింది.

Follow Us